AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: వినూత్న గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికంగా అంతా మంచే..!

మిత్ర గ్రహాలైన శని, శుక్ర, బుధులు ప్రస్తుతం తమ స్వక్షేత్రాలలో సంచారం చేస్తున్నాయి. శని కుంభ రాశిలో, బుధుడు కన్యా రాశిలో, శుక్రుడు తులా రాశిలో దాదాపు ఒకే సమయంలో సంచారం చేయడమనేది అరుదైన విశేషం. ఒక మూడు వారాల పాటు ఈ మూడు గ్రహాలు తమ స్వస్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగపరంగా, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.

Astrology: వినూత్న గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికంగా అంతా మంచే..!
Telugu Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 22, 2024 | 10:18 PM

Share

మిత్ర గ్రహాలైన శని, శుక్ర, బుధులు ప్రస్తుతం తమ స్వక్షేత్రాలలో సంచారం చేస్తున్నాయి. శని కుంభ రాశిలో, బుధుడు కన్యా రాశిలో, శుక్రుడు తులా రాశిలో దాదాపు ఒకే సమయంలో సంచారం చేయడమనేది అరుదైన విశేషం. ఒక మూడు వారాల పాటు ఈ మూడు గ్రహాలు తమ స్వస్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగపరంగా, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా శుభవార్తలే వింటారు. తలపెట్టిన ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. మేషం, వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ వినూత్న గ్రహ సంచారం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి.

  1. మేషం: ఈ రాశికి లాభాధిపతి శని లాభంలో, షష్టాధిపతి బుధుడు షష్టంలో, సప్తమాదిపతి శుక్రుడు సప్త మంలో సంచారం చేయడం వల్ల ముఖ్యమైన కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. అత్యధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. విలాస జీవితం గడుపుతారు. గృహ, వాహనాలను అమర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృతి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి.
  2. వృషభం: ఈ రాశికి దశమాధిపతి, పంచమాధిపతి, రాశ్యధిపతి ఎవరి స్థానాల్లో వారున్నందువల్ల జీవనశైలి కొత్త పుంతలు తొక్కుతుంది. సుఖ సంతోషాలతో, మనశ్శాంతితో జీవితం గడపడానికి అవకాశం కలుగుతుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. లాభదాయక అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  3. మిథునం: ఈ రాశికి రాశ్యధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి ఎవరి స్థానాల్లో వారు సంచారం చేస్తున్నందు వల్ల, ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూ లంగా పరి ష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఒక్కసారిగా జోరందుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదాలు పెరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆశించిన శుభ వార్తలు వింటారు.
  4. కన్య: ఈ రాశిలో రాశ్యధిపతి, ధన స్థానంలో ధనాధిపతి, షష్టంలో షష్టాధిపతి సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా దాదాపు పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి బయ టపడడం జరుగుతుంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. నిరు ద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానాధిపతి, దశమాధిపతి, లాభాధిపతి ఎవరి స్థానాల్లో వారున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక లాభాలు వృద్ధి చెందుతాయి. ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా అంచ నాలకు మించి సత్ఫలితాలనిస్తుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
  6. మకరం: ఈ రాశికి ధనాధిపతి ధన స్థానంలో, భాగ్యాధిపతి భాగ్య స్థానంలో, దశమాధిపతి దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు, హోదాలు పెరగడం, వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపట్టడం, ఆదనపు ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు