Horoscope Today: అనేక మార్గాల్లో వారి ఆదాయం వృద్ధి చెందుతుంది.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 24, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారికి నూతన వాహన యోగం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (సెప్టెంబర్ 24, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారికి నూతన వాహన యోగం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగులకు ఆశించిన స్థానచలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, లాభ సాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభ కార్యాల్లో బంధుమిత్రుల నుంచి విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయపరంగా అనుకూలతలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వ్యాపారాల్లో ఒక మోస్తరు లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగులు అధికారులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి జీవితం యథావిధిగా కొనసాగుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. బంధువు లతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేసే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగులకు తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. లాభాలు బాగా పెరిగి, వృత్తి, వ్యాపారాలను విస్తరించే ఆలోచన చేస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వాహన యోగం ఉంది. ఏ ప్రయత్నం చేపట్టినా బాగా కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాలు బిజీగా, లాభ సాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని పరిచయాలతో ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. కొన్ని వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. బంధు మిత్రులు మీ వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులు తమ బాధ్యతలు, విధుల నిర్వహణలో పొరపాట్లు దొర్లకుండా చూసుకోవాలి. వ్యాపా రాలు సామాన్యంగా లాభిస్తాయి. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కీలక వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఆక స్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉండకపోవచ్చు. సహోద్యోగులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. వృత్తి జీవితం సాధారణంగా సాగిపోతుంది. వృథా ప్రయా ణాలు చేయాల్సి వస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనులు కొద్దిపాటి వ్యయప్రయాసలతో పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన జవాబు లభిస్తుంది. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. నూతన వాహనాన్ని కొనే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలన్నీ సంతృప్తికరంగా సాగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. సమాజంలోని పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు, పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. కొందరు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వా నాలు అందుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది కానీ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కుటుంబ వ్యవహారాల్ని సరైన రీతిలో చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో పనిభారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహా రాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరు ద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా మాత్రమే లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ప్రస్తుతానికి బంధుమిత్రులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆస్తి వివాదంలో సోదరులు సహకరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల వల్ల ఖర్చులు పెరుగుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి జీవితం నిలకడగా సాగిపోతుంది. కొత్త ఉద్యోగానికి సంబంధించి సన్నిహితుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న సమ యానికి ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరిగి ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసు కుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఉత్సాహంగా, చురుకుగా ముందుకు సాగుతాయి. ముఖ్య మైన వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.