Astrology: శుభాధియోగం.. ఆ రాశుల వారికి ఉద్యోగంలో అధికార యోగాలు, పలు శుభాలు..!

ఏ రాశికైనా 6, 7, 8 స్థానాల్లో బుధ, శుక్ర, గురువుల వంటి శుభ గ్రహాలు సంచారం చేస్తున్న పక్షంలో ఆ రాశుల వారికి శుభాధియోగం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార యోగం కలగడం, వృత్తి, వ్యాపారాలు పైచేయి సాధించడం, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడం, ఆరోగ్య సమస్యలు బాగా తగ్గి చురుకుదనం పెరగడం ఈ అధియోగ లక్షణాలు.

Astrology: శుభాధియోగం.. ఆ రాశుల వారికి ఉద్యోగంలో అధికార యోగాలు, పలు శుభాలు..!
Shubadi Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 24, 2024 | 6:14 PM

ఏ రాశికైనా 6, 7, 8 స్థానాల్లో బుధ, శుక్ర, గురువుల వంటి శుభ గ్రహాలు సంచారం చేస్తున్న పక్షంలో ఆ రాశుల వారికి శుభాధియోగం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార యోగం కలగడం, వృత్తి, వ్యాపారాలు పైచేయి సాధించడం, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడం, ఆరోగ్య సమస్యలు బాగా తగ్గి చురుకుదనం పెరగడం ఈ అధియోగ లక్షణాలు. మేషం, వృషభం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశలకు ఈ శుభాధియోగం కలిగింది. వీరికి మూడు వారాల పాటు ఈ అధియోగం కొనసాగుతుంది. ఈ మూడు వారాల పాటు వీరి జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి.

  1. మేషం: ఈ రాశికి 6, 7 స్థానాల్లో బుధ, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి, వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కడానికి అవకాశం ఏర్పడింది. అనేక వైపుల నుంచి అంచ నాలకు మించి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలావరకు పరి ష్కారమై మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పెళ్లి ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి ఆరవ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడంతో పాటు అనేక సమస్యలు పరిష్కారం అవు తాయి. వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, అనా రోగ్య సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ తో పాటు, రాబడి బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  3. తుల: ఈ రాశికి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు కలలో కూడా ఊహించని స్పందన లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగి ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు తగ్గిపోతారు.
  4. వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఎటువంటి సానుకూల ప్రయత్నం చేసినా తప్ప కుండా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయపరమైన అభివృద్ధి ఉంటుంది. సంప న్నుల స్థాయి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ప్రతిభ, సమర్థతలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  5. కుంభం: ఈ రాశికి ఎనిమిదవ స్థానంలో ఉచ్ఛ బుధుడి సంచారం వల్ల చాలా కాలంగా పీడిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. సమర్థతలో సహోద్యో గులను మించి పోవడం జరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పట్టడం జరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అయి విలువైన ఆస్తి లభిస్తుంది.
  6. మీనం: ఈ రాశికి సప్తమంలో బుధుడు, అష్టమ స్థానంలో శుక్ర సంచారం వల్ల శుభాధియోగం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగంలో భారీ వేతనాలతో కూడిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. జీవన శైలిలో పూర్తిగా మార్పు వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగం లభిస్తుంది.