Horoscope Today: ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (సెప్టెంబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (సెప్టెంబర్ 25, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
చేపట్టిన పనులన్నీ ఉత్సాహంగా పూర్తవుతాయి. ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది కానీ వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఉద్యోగులు అదనపు బాధ్యత లను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. కొద్దిగా అనా రోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును వసూలు చేసుకుం టారు. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడం మీద దృష్టి పెడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయంతో సమానంగా ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో శ్రమ తప్పకపోవచ్చు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలు సవ్యంగా సాగి పోతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రణాళికాబద్దంగా పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇంటికి బంధుమిత్రుల రావడం వల్ల సందడిగా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా పెరుగు తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
కొత్త ప్రయత్నాలు చేపట్టి, అనుకున్న విధంగా నెరవేర్చుకుంటారు. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. పిల్లలు చదువుల్లో ముందుంటారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యో గాలు ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేయాల్సి వస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగులకు శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన వ్యవహా రాలు చురుకుగా, వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆదాయం నిల కడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు బాగా తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగులు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలు బాగా బిజీ అయి పోతాయి. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగు తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుం టారు. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. ఆదాయానికి, ఖర్చులకు ఏ మాత్రం పొంతన ఉండదు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఇష్టమైన బంధుమిత్రుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవ హారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఒకటి రెండు వివాదాలను పరిష్కరించు కుంటారు. వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అందు తాయి. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. బాకీలు, బకాయిలను వసూలు చేసుకుం టారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందజేస్తారు. వాహన యోగం పడుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉంటుంది. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు సాదా సీదాగా సాగుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలున్నా పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు, విభేదాలు చాలావరకు సర్దుమణుగుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్య మైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యో గాల్లో కొద్దిపాటి ఇబ్బందులకు ఆస్కారముంది. మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆస్తి సమస్య ఒకటి తేలికగా పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అధికారుల సహాయంతో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూ లంగా, లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువుల తోడ్పాటుతో పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరు ద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి