AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Gochar 2024: త్వరలో నక్షత్రం మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

మంద గమనుడు శనిశ్వరుడి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఈ నేపధ్యంలో శనిశ్వరుడి 3 అక్టోబర్ 2024న అంటే నవరాత్రుల మొదటి రోజున శతభిషా నక్షత్రంలో సంచరించబోతున్నాడు. శనిశ్వరుడి ఈ నక్షత్ర మార్పు కారణంగా కొన్ని రాశుల వారు వృత్తి, వ్యాపార పురోగతిని పొందవచ్చు.

Shani Gochar 2024: త్వరలో నక్షత్రం మార్చుకోనున్న శనీశ్వరుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Lord Shanidev
Surya Kala
|

Updated on: Sep 25, 2024 | 7:47 PM

Share

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. అయితే నవ గ్రహాలలో శనిశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనిశ్వరుడిని న్యాయదేవతగా అభివర్ణించారు. మంద గమనుడు శనిశ్వరుడి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఈ నేపధ్యంలో శనిశ్వరుడి 3 అక్టోబర్ 2024న అంటే నవరాత్రుల మొదటి రోజున శతభిషా నక్షత్రంలో సంచరించబోతున్నాడు. శనిశ్వరుడి ఈ నక్షత్ర మార్పు కారణంగా కొన్ని రాశుల వారు వృత్తి, వ్యాపార పురోగతిని పొందవచ్చు.

శని సంచారం ఎప్పుడు జరుగుతుందంటే

పంచాంగం ప్రకారం శనిశ్వరుడి అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12.20 గంటలకు శతభిషా నక్షత్రంలో సంచరించబోతున్నాడు. శతభిషా నక్షత్రంలో శనిశ్వరుడి ప్రవేశం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు చాలా శుభప్రదం అవుతుంది. ఈ రోజు అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం అదృష్టంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీంతో సంపద వృద్ధి చెందుతుంది. మేషరాశిలో శనిశ్వరుడి పదకొండవ స్థానంలో ఉండటం వల్ల ఈ రాశుల వారు తమ వృత్తి, వ్యాపారాలలో గొప్ప విజయాన్ని పొందవచ్చు. అంతేకాదు అప్పుల నుండి కూడా విముక్తి పొందుతారు.

సింహ రాశి

సింహ రాశికి చెందిన వ్యక్తులు కూడా శనిశ్వరుడి నక్షత్ర మార్పుతో శుభ ఫలితాలను పొందగలరు. సింహ రాశి వారికి ఈ మార్పు కెరీర్, వ్యాపారానికి మాత్రమే కాకుండా వైవాహిక జీవితానికి కూడా మంచిది. సింహ రాశి వారు తమ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శనిశ్వరుడి నక్షత్ర మార్పు శుభప్రదం అవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. వస్తు సౌఖ్యాలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

శనిశ్వరుడిని ఆరాధించడానికి శనివారం ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయం తర్వాత శనిశ్వరుడిడిని పూజించాలి. శనిశ్వరుడిని ఆరాధించే సమయంలో ఎవరైనా అతని కళ్ళలోకి నేరుగా చూడకూడదు. శనిశ్వరుడి పూజించే సమయంలో కళ్ళు మూసుకుని లేదా శనిశ్వరుడి పాదాల వైపు చూడాలని గుర్తుంచుకోవాలి. శనిశ్వరుడి కళ్లలోకి చూడటం వల్ల చెడు దృష్టి పడుతుందని నమ్మకం. శనిశ్వరుడిని పూజించే సమయంలో ముఖం పడమర వైపు ఉండాలి. శనిశ్వరుడిని పూజించేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించకూడదు. శనిశ్వరుడికి ఇష్టమైన రంగులు నీలం, నలుపు. ఈ రంగుల దుస్తులను ధరించి పూజించాలి.

శనిశ్వరుడి ఆరాధన ప్రాముఖ్యత

శనిశ్వరుడు న్యాయాధిపతి. కర్మకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. శనిశ్వరుడి కుంభం, మకరరాశిని పాలించే గ్రహం. శనిశ్వరుడి పూజించడం వల్ల రోగాలు, అప్పులు, సంతానలేమి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆటంకాలు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..