Horoscope Today: శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి సాయపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 23, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృషభ రాశి వారు వృథా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మిథున రాశి వారికి ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి సాయపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 23th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 23, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 23, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృషభ రాశి వారు వృథా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మిథున రాశి వారికి ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ముఖ్యమైన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి కొనుగోలు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర మాల్లో పాల్గొంటారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృథా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. పిల్లలకు మంచి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ, వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు, లాభాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. బంధుమిత్రుల నుంచి అవసరానికి డబ్బు అందుతుంది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలున్నా, అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదా యం బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయానికి మించి ఖర్చు ఉంటుంది. ప్రముఖుల నుంచి గౌరవాభిమానాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపో తుంది. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరు గుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా సాగి పోతాయి. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగు లకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాల అభివృద్ధికి సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహకారం అందజేస్తారు. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. రుణ సమస్యలను చాలావరకు తీర్చగలుగుతారు. వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సమస్యల్ని సమయస్ఫూత్తితో పరిష్కరించుకుంటారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలోనే కాకుండా వృత్తి, వ్యాపారాల్లో కూడా పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆరో గ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. కొన్ని వ్యక్తిగత విషయాల్లో సన్నిహితులతో విభేదాలు ఏర్పడ తాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్య ఉన్నప్పటికీ, లాభాలపరంగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అధికారులకు బాగా దగ్గరవుతారు. జీతభత్యాల పెరుగుదల విషయంలో శుభవార్తలు వింటారు. చేపట్టిన వ్యవహా రాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. వృథా ఖర్చు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాల్లో కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ము కూడా అనుకోకుండా చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవ కాశం ఉంది. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా అనుకూల తలు బాగా పెరుగుతాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. నిరుద్యో గులకు మంచి ఉద్యోగావకాశం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం పడతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే, ఖర్చులు బాగా పెరుగుతాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. మంచి పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాను కూల వాతావరణం ఉంటుంది. కొందరు బంధువుల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనుకో కుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంత పనుల మీద వీలైనంత శ్రద్ధ పెట్టడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అవసరానికి డబ్బు అందుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకోవడానికి సమయం అనుకూ లంగా ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. పిల్లల చదువులపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన పనుల్లో శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.