Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 21, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలలో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారికి వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 21st June 2024
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 21, 2024 | 9:07 AM

దిన ఫలాలు (జూన్ 21, 2024): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాలలో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారికి వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలలో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినడం జరుగు తుంది. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి లబ్ధి పొందుతారు. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగుల మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహా రాల మీద దృష్టి పెడతారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. అనవసర వ్యయంతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. శత్రు, రోగ, రుణ సమస్యలు బాగా తగ్గి ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో శ్రమ తక్కువ, ఫలితంగా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు నిల కడగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉంటుంది. రావలసిన డబ్బు వసూలు అవుతుంది. పిల్లల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆస్తి వ్యవహారా లలో అప్రమత్తంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయస్కరం. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కాస్తంత ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో, ఇతర కుటుంబ సభ్యులతో సామరస్యంగా గడిచిపో తుంది. ఇతరులకు సహాయం చేసి ఇబ్బందులు పడతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవ హారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. ఆరోగ్యం పరవాలేదు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికి రాదు. దానధర్మాలను తగ్గించుకోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయ్యే అవకాశముంది. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరిగే సూచనలున్నాయి. అధికారులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. బంధువుల వ్యవహారాలలో కల్పించుకోకపోవడం శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం నిల కడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఉన్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. మిత్రుల నుంచి అవసరమైన సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలుంటాయి. తలపెట్టిన పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. బాధ్యతల నిర్వహణలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం చాలా మంచిది. కుటుంబ సంబంధమైన శుభ వార్తలు వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు జరుగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా ఇది వీలైన సమయం. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో కొత్త గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. ఆదాయానికి లోటుండదు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కొందరు మిత్రులకు సహాయంగా ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగు తాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను పనితీరుతో మెప్పిస్తారు. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. అధికారులు కొత్త బాధ్యతలు అప్ప గించే అవకాశముంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. తోబుట్టువుల వల్ల కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపార జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకోని మార్పులు చోటు చేసు కుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది.

ట్రంప్‌ దాడి వెనుక రహస్యం ఏంటి? దుండగుడు దాగున్న ఆ బిల్డింగ్‌లోనే
ట్రంప్‌ దాడి వెనుక రహస్యం ఏంటి? దుండగుడు దాగున్న ఆ బిల్డింగ్‌లోనే
వివాదంలో హీరో రక్షిత్ శెట్టి.. పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
వివాదంలో హీరో రక్షిత్ శెట్టి.. పోలీస్ కేసు నమోదు.. అసలు ఏమైందంటే?
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
రైల్వే బ్రిడ్జిపై దంపతుల రీల్స్.. అంతలో రైలు ఎంట్రీ!
రైల్వే బ్రిడ్జిపై దంపతుల రీల్స్.. అంతలో రైలు ఎంట్రీ!
పోస్ట్ మాస్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
పోస్ట్ మాస్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
అత్తగారికి ఎదురుతిరిగిన కళావతి.. రౌడీ బేబీ అరెస్ట్!
అత్తగారికి ఎదురుతిరిగిన కళావతి.. రౌడీ బేబీ అరెస్ట్!
ఏంటీ..! ఈ స్టార్ హీరోయిన్‌‌ను పరిచయం చేసింది ఈయన..!!
ఏంటీ..! ఈ స్టార్ హీరోయిన్‌‌ను పరిచయం చేసింది ఈయన..!!
'బైడెన్‌.. మళ్లీ మళ్లీ తడబడుచుండేన్‌'తలలు పట్టుకున్న డెమోక్రాట్లు
'బైడెన్‌.. మళ్లీ మళ్లీ తడబడుచుండేన్‌'తలలు పట్టుకున్న డెమోక్రాట్లు
కృష్ణుడికి దుర్యోధనుడి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా..
కృష్ణుడికి దుర్యోధనుడి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా..
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చు? భారీగా ఉంటే నోటీసు వస్తుందా?
పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చు? భారీగా ఉంటే నోటీసు వస్తుందా?
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..