Horoscope Today: ఈ రాశుల వారికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది.. ఈరోజు రాశి ఫలాలు..
రాశి ఫలాలను ఇప్పటికీ విశ్వసించేవారు లేకపోలేదు. రోజులో తమకు ఎదురుకాబోయే పరిస్థితులను
రాశి ఫలాలను ఇప్పటికీ విశ్వసించేవారు లేకపోలేదు. రోజులో తమకు ఎదురుకాబోయే పరిస్థితులను రాశిఫలాల ద్వారా అంచనా వేస్తుంటారు.. ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ. ఆదివారం.. చంద్రుడు మేషరాశిలో ఉండనున్నాడు. మరీ ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేష రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయం కావు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో వివాదం ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు.
వృషభ రాశి.. ఈరోజు వీరు అనవసర ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగరంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది.
మిథున రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి.
సింహా రాశి.. ఈరోజు వీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబసభ్యువులు.. స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.
కన్య రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళన తప్పదు. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు, స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తాగా ఉండాలి.
తుల రాశి.. ఈరోజు వీరు ఇంట్లో మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థానచల సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరు అనుకున్న పనులు జరగవు. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నింటాలి.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరు సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకర రాశి.. ఈరోజు వీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు.
కుంభ రాశి.. ఈరోజు వీరు ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
మీన రాశి.. ఈరోజు వీరు ప్రయణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Shankar’s daughter: మెగా హీరో సినిమా కోసం పాట పాడిన టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు…
Salaar : సలార్ సినిమా ఓటీటీ ఆఫర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే.. ఏ సౌత్ సినిమాకు దక్కని రికార్డ్ ఇది..
Shilpa Shetty: రూ. కోట్ల విలువైన ఆస్తులను శిల్పాకు ట్రాన్స్‌ఫర్ చేసిన రాజ్‌కుంద్రా.. అదే కారణమంటూ..