AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశుల వారు ఆరోగ్యంతోపాటు.. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. రాశిఫలాలు..

Horoscope 1 July 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ రాశిఫలాలు..జాతక చక్రాలను విశ్వసించేవారు అనేకం ఉంటారు. రోజులో తమకు ఎలాంటి పరిస్థితులు

Horoscope Today: ఈ రాశుల వారు ఆరోగ్యంతోపాటు.. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. రాశిఫలాలు..
Rajitha Chanti
|

Updated on: Jul 01, 2021 | 7:12 AM

Share

Horoscope 1 July 2021: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ రాశిఫలాలు..జాతక చక్రాలను విశ్వసించేవారు అనేకం ఉంటారు. రోజులో తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి..ఎలాంటి పనులు మొదలు పెట్టాలి అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈరోజు జూన్ 1న రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి.. ఈరోజు వీరికి వేరు వేరు రూపాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ.. వ్యక్తిగత అభివృద్ధి పనులు చేపట్టాలి. నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.

వృషభ రాశి.. ఈరోజు వీరికి నూతనమైన కార్యక్రమాల్లో పాల్గోనడం… అప్పులు చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది.

మిధున రాశి.. ఈరోజు వీరికి స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఒత్తిడిలు ఏర్పడుతుంటాయి. రాజకీయ పరమైన కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరికి ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తుంది. ఆహారవిహారాదులలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓం గం గణపతియే నమః నామ స్మరణ మేలు చేస్తుంది.

సింహ రాశి.. ఈరోజు వీరికి సౌకర్యాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాహన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు మూర్తి ఆరాధన మేలు చేస్తుంది. విష్ణు మూర్తి ఆరాధన మేలు చేస్తుంది.

కన్యరాశి.. ఈరోజు వీరికి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. హానుమాన్ పూజా మేలు చేస్తుంది.

తులారాశి.. ఈరోజు వీరికి అనుకున్నటువంటి పనులలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతుంటాయి. లక్ష్మీ నృసింహ స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది.

వశ్చిక రాశి.. ఈరోజు వీరికి చేపట్టిన పనులు పూర్తి అయ్యేందుకు దూరపు బంధువులు సహాయపడుతుంటారు. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనులలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాల విషయంలో ఒత్తిడి ఉండే సందర్భాలు కనిపిస్తున్నాయి. విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి.. ఈరోజు వీరు కీలకమైన నిర్ణయాలు తీసుకొని.. ఉద్యోగాల విషయంలో కొన్ని బాధ్యతలు చేపడుతుంటారు. దూరపు బంధువుల ఆరోగ్య విషయాలు తెలుస్తుంటాయి. ధన్వంతరి స్తోత్ర పారాయణం మంచిది.

కుంభరాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వీడియో..

మీన రాశి.. ఈరోజు వీరికి ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. శుభకార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే సందర్భాలు కనిపిస్తున్నాయి. శివాభిషేకం మేలు చేస్తుంది.

Also Read: AOB Bandh : నేడు ఏవోబీ బంద్‌కి పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఏజెన్సీలో హై అలర్ట్.. అడవిని జల్లెడ పడుతున్న బలగాలు..

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..