Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
దిన ఫలాలు (జనవరి 16, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారు వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి జీవితంలో కూడా కొద్దిగా మార్పులు చేసుకుంటాయి. మిథున రాశి వారికి రోజంతా బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జనవరి 16, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో కూడా కొద్దిగా మార్పులు చేసుకుంటాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. వ్యాపారాల్లో అంచనా లకు తగ్గట్టుగా లాభాలు అందుకుంటారు. కొద్దిగా ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్త వింటారు. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, స్పెక్యులేషన్ వంటివి బాగా లాభిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి జీవితంలో కూడా కొద్దిగా మార్పులు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. తలపెట్టిన పనులన్నిటీనీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
రోజంతా బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవి తం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఎటువంటి ఇబ్బందీ ఉండక పోవచ్చు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. నిరుద్యోగు లకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శి స్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. మంచి పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. కుటుంబ ఖర్చుల్ని బాగా అదుపు చేస్తారు. తండ్రి వైపు నుంచి కొద్దిగా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహ ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. బంధుమిత్రు లకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో అందు తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. ముఖ్య మైన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాల మీద మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధి స్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోని సంస్థల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. కొద్ది ప్రయ త్నంతో వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యో గంలో మీ పని తీరు మరింతగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొందరు మిత్రుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగంలో ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి.బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉండే అవ కాశం ఉంది. జీత భత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యో గాలలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయోజనాలు వృద్ది చెందుతాయి. వృత్తి జీవితం బిజీ సాగిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగిపోతాయి. సాధార ణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం పెరుగుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపా రాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపా రాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయానికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తి సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.