Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 12, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, అదనపు రాబడికి, లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం మరీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ వెనుక కుట్రలు, కుతంత్రాలు చేసేవారుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు కాస్త జాగ్రత్త.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 12th August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 12, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 12, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి, అదనపు రాబడికి, లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం మరీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ వెనుక కుట్రలు, కుతంత్రాలు చేసేవారుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయానికి, అదనపు రాబడికి, లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలను క్రమంగా తగ్గించుకుంటారు. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ఆలోచనలు, నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు ఫలించడం జరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పని భారం మరీ ఎక్కువగా ఉంటుంది. మరోపక్క అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సా హం కొనసాగుతుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వానికి భంగం ఉండదు. వృత్తి, వ్యాపారాలు కూడా నిలకడగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖసంతోషాలకు లోటుండదు. సామాజికంగా ప్రాభవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో కొద్దిగా టెన్షన్లు ఉండే అవకాశం ఉంది. వివాదాలకు, ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో మీ వెనుక కుట్రలు, కుతంత్రాలు చేసేవారుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే పెరుగుతుంది కానీ, వృథా ఖర్చులను అదుపు చేయడం అవసరం. చిన్న పనికి కూడా భారీగా ప్రయత్నం చేయవలసి వస్తుంది. వ్యక్తిగత సమ స్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది కానీ, ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. బ్యాంక్ నిల్వలకు లోటుండదు. షేర్లు, చిన్న వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేస్తారు. ఉద్యోగంలో అధికా రుల ఆదరణకు లోటుండదు కానీ, అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. నిరుద్యో గులకు విదేశీ అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. గృహ జీవితం ఉత్సాహంగా, హుషారుగా సాగిపోతుంది. సోదరులతో ఆస్తి వివాదాలకు అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ధనానికి లోటుండదు కానీ, ప్రస్తుతానికి ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాల నుంచి కూడా శుభవార్తలు అందుతాయి. ఎంత సంపాదించినప్పటికీ, అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు బాగా మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో పుణ్య క్షేత్ర దర్శనాలకు అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు, శత్రు పీడలు, అనారోగ్య సమ స్యల నుంచి చాలావరకు బయటపడతారు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. చేతిలో ఒక పట్టాన డబ్బు నిలవదు. మిత్రులు కూడా మోసం చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ది స్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణ మాత్రం లోపభూయిష్ఠంగా సాగుతుంది. అనవసర పరిచయాల మీద ఖర్చు పెరు గుతుంది. విలాస జీవితానికి, వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ జీవితం హుషారుగా, సంతృప్తికరంగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయ ప్రయత్నాలు, ఆదాయ వ్యవహారాలు జయప్రదంగా సాగిపోతాయి. ఆర్థికంగా కొన్ని కష్ట నష్టాల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అధికా రులు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపో తాయి. ప్రతి ప్రయత్నంలోనూ వ్యయ ప్రయాసలుంటాయి. శ్రమాధిక్యత కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. నిరు ద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుఝల మీద ఖర్చులు బాగా పెరుగు తాయి. కుటుంబంలో కొద్దిగా టెన్షన్లు ఉండే అవకాశం కూడా ఉంది. అద్దె ఇంటివారు ఇల్లు మారే అవకాశం ఉంది. రావలసిన డబ్బు ఒక పట్టాన చేతికి అందక ఇబ్బంది పడతారు. కొందరు బంధు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం పరవాలేనిపిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. లాభాలకు ఏమాత్రం లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారులు బాగా ఒత్తి డికి గురి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా నిరాశ తప్పకపోవచ్చు. కుటుంబపరమైన ఒత్తిడి ఉంటుంది. ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కష్టార్జితంలో ఎక్కువగా భాగం వృథా అయిపోతుంటుంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత ఉంటుంది. ఇతరుల పనుల వదిలేసి సొంత పనుల మీద శ్రద్ధ పెట్ట డం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు తలపెడ తారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారులు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి, ప్రోత్సహి స్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. కొన్ని వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. అనవసర పరిచయాలతో పక్కదోవ పడతారు. ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. వ్యాపారా లను విస్తరించడానికి, పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. కుటుంబ జీవితంలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. జీవిత భాగస్వామితో సానుకూలంగా వ్యవహరించడం మంచిది.

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..