Money Astrology: బుధాదిత్య యోగం..ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారం..!
ఈ నెల 16 నుంచి 22 వ తేదీ వరకు సింహ రాశిలో రవి, బుధుల కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఎక్కడ జరిగినా ఇది బుధాదిత్య యోగంగా చెలామణీ అవుతుంది. ఇందులో రవికి ఈ రాశి స్వస్థానం కాగా, బుధుడు వక్రగతిలో ఉండడం జరుగుతోంది. ఫలితంగా, ఈ యోగం రెట్టింపు బలంతో ఫలితాలనిస్తుంది.
ఈ నెల 16 నుంచి 22 వ తేదీ వరకు సింహ రాశిలో రవి, బుధుల కలయిక ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక ఎక్కడ జరిగినా ఇది బుధాదిత్య యోగంగా చెలామణీ అవుతుంది. ఇందులో రవికి ఈ రాశి స్వస్థానం కాగా, బుధుడు వక్రగతిలో ఉండడం జరుగుతోంది. ఫలితంగా, ఈ యోగం రెట్టింపు బలంతో ఫలితాలనిస్తుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశులు ఈ యోగం వల్ల అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ యోగం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సమసి పోవడం వంటివి జరుగుతాయి.
- మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, బుధుల కలయిక వల్ల ఆర్థిక సమస్యల నుంచి, ఆస్తి వివాదాల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి, వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఎటు వంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సంతాన యోగం పట్టవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని చిక్కు సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. మీ ప్రతిభ బయటివారికి కూడా ఉపయోగపడుతుంది.
- వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఈ రాశికి శుభ గ్రహాలైన బుధ, రవులు కలవడం వల్ల ఈ యోగం ఊహించని సత్ఫలితాలనిస్తుంది. ఈ రాశివారి ప్రతిభా పాటవాలకు ఉద్యోగంలోనే కాక, సర్వత్రా గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులను ఈ ప్రతిభతో ఆకట్టుకుంటారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి.
- కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి రవితో యోగం పట్టడం విశేషం. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో శుభ కార్యం జరగ డానికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. సంపన్నులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా పిత్రార్జితం లభిస్తుంది.
- సింహం: రాశినాథుడు రవి తన స్వస్థానంలో సంచారం చేయడం, ధన, లాభాధిపతి బుధుడితో యుతి చెందడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయానికి, ఆరో గ్యానికి లోటుండదు. ప్రముఖులలో ఒకరుగా చెలామణీ అవుతారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.
- తుల: ఈ రాశికి లాభ స్థానంలో భాగ్య, లాభాధిపతుల కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల కుటుంబ, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు సానుకూలంగా పరిష్కారమ వుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి భాగ్య స్థానంలో నవమ, దశమాధిపతులు కలవడం, బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల జీవితంలో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. విదేశీ సొమ్ము అనుభవించడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా లాభదాయకంగా పూర్తవుతుంది.