Shubh Yoga: ఒకేసారి అత్యంత శుభ, ధన యోగాలు.. ఆ రాశుల వారికి సంపద వృద్ధి..!

ఈ నెల 13, 14, 15 తేదీల్లో వృశ్చిక రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశికి సప్తమ స్థానమైన వృషభ రాశిలో కుజ, గురులు సంచారం జరుగుతున్నందువల్ల అత్యంత శుభ యోగాలు, ధన యోగాలైన చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. వీటివల్ల ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలన్నీ పూర్తి స్థాయిలో నెరవేరడం జరుగుతుంది.

Shubh Yoga: ఒకేసారి అత్యంత శుభ, ధన యోగాలు.. ఆ రాశుల వారికి సంపద వృద్ధి..!
Zodiac Signs
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 11, 2024 | 9:26 PM

ఈ నెల 13, 14, 15 తేదీల్లో వృశ్చిక రాశిలో చంద్ర సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశికి సప్తమ స్థానమైన వృషభ రాశిలో కుజ, గురులు సంచారం జరుగుతున్నందువల్ల అత్యంత శుభ యోగాలు, ధన యోగాలైన చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. వీటివల్ల ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రయత్నాలన్నీ పూర్తి స్థాయిలో నెరవేరడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ ఫలితాలు, శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ప్రస్తుతం వృశ్చిక రాశిలో చంద్ర సంచారం వల్ల వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశులవారు అత్యధికంగా ప్రయోజనం పొందడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజ, గురువులతో వృశ్చిక రాశిలో ప్రవేశించిన చంద్రుడికి సమ సప్తకం ఏర్పడినందువల్ల చంద్ర మంగళ, గజకేసరి యోగాలు ఏర్పడ్దాయి. దీని వల్ల అప్రయత్న ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందడం, బాకీలు, బకాయిలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. భాగ్య యోగాలు కలుగుతాయి.
  2. సింహం: ఈ రాశికి దశమ, చతుర్థ స్థానాల్లో ఈ రెండు మహా భాగ్య యోగాలు ఏర్పడినందువల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆస్తి సంబంధమైన ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివా దం పరిష్కారమై, విలువైన ఆస్తి లభించే అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక ఒప్పం దాలు కుదురుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.
  3. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర మంగళ, గజకేసరి యోగాలు ఏర్పడినందువల్ల ఊహించని విధంగా ఆస్తి కలిసి వస్తుంది. పితృమూలక ధన లాభం, వారసత్వ సంపద వంటివి లభిస్తాయి. విదేశీ సొమ్మును అనుభవించే అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరిగి, రాబడి అంచనాలను మించుతుంది. అదనపు ఆదాయాన్ని భూముల్లోనూ, షేర్లలోనూ మదుపు చేసే అవకాశం ఉంది.
  4. వృశ్చికం: ఈ రాశికి సప్తమంలో రాశ్యధిపతి కుజుడికి సంబంధించిన చంద్ర మంగళ యోగం ఏర్పడు తు న్నందు వల్ల వీరి ఆదాయ పరిస్థితి రాత్రికి రాత్రి మారిపోయే అవకాశం ఉంటుంది. జీవితంలో అనుకోకుండా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవనశైలిలో మార్పు వస్తుంది. జీవిత భాగస్వామికి కూడా మహా భాగ్య యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగంలో కలలో కూడా ఎరుగని ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది.
  5. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర మంగళ, గజకేసరి యోగాలు పట్టడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, ఆకస్మిక పదవీ యోగానికి అవ కాశం ఉంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఊహించని శుభ ఫలి తాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగపరంగా జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగడంతో పాటు రాబడి కూడా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రెండు మహా యోగాలు ఏర్పడినందువల్ల కుటుంబపరంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అనేక విధాలుగా పెరిగి, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆస్తి విలువ పెరగడం, ఆస్తి విలువ సానుకూలంగా పరిష్కారం కావడం, తల్లి వైపు నుంచి సంపద లభించడం వంటివి జరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు అనూహ్యంగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది.