AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరు చేయని తప్పుకు నిందలు పడతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (11-03-2022): కొత్త పనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా రోజులో ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు.

Horoscope Today: వీరు చేయని తప్పుకు నిందలు పడతారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Basha Shek
|

Updated on: Mar 11, 2022 | 7:25 AM

Share

Horoscope Today (11-03-2022): కొత్త పనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా రోజులో ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. మంచి ముహూర్తం గురించి వెతుకుతారు. ఇందులో భాగంగా చాలామంది తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. మరి ఈరోజు (మార్చి 11వ తేదీ ) శుక్రవారం (Friday) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషం

ఈరాశి వారు ఈరోజు కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. అయితే ఏదైనా కొత్త పనులు ప్రారంభించబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. త్వరగా పూర్తయ్యేలా ప్లాన్స్‌ వేసుకోవాలి. అదేవిధంగా ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

వృషభం

శారీరక శ్రమ పెరుగుతుంది. ఇబ్బందులు ఎదురవుతాయి. చేయని తప్పుకు నిందలు పడాల్సి వస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. బంధువులు, స్నేహితులతో వాదనలకు దిగవద్దు. నవగ్రహ పారాయణం పఠిస్తే మంచి కలుగుతుంది.

మిథునం..

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే పట్టుదల మాత్రం కోల్పోకూడదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మాటలను గౌరవించాలి. శివుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటకం ఆశించిన ఫలితాలు అందుకుంటారు. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులు ఆటంకం లేకుండా పూర్తి చేస్తారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచి కలుగుతుంది.

సింహం

భవిష్యత్తు కోసం మరిన్ని ప్రణాళికలు వేసుకుంటారు. విందులు, వినోదాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఒక సంఘటన బాగా ఇబ్బంది పెడుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే మంచి కలుగుతుంది

కన్య

ఈరాశివారు ఈరోజు ఆశించిన ఫలితాలు సొంతం చేసుకుంటారు. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధించారు. ఇష్ట దేవతలను ఆరాధిస్తే మంచి కలుగుతుంది.

తుల

ఒక సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శి్స్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది.

వృశ్చికం

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలి. అయితే అనుకున్న ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే టప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గణపతి స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది.

ధనుస్సు

ఈరాశివారికి ఈరోజు ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సహకారంతో పనులు పూర్తిచేయగలుగుతారు. అయితే కొందరు మిమ్మల్ని తప్పుదారి పట్టించే వారు ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి.

మకరం

కీలక వ్యవహారాలలో అధికారులు, ఉన్నతోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు మరింత పెరుగుతాయి. కుటుంబీకులు, బంధు,మిత్రులు, స్నేహితులు, సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి కలుగుతుంది.

కుంభం మీ మనోధైర్యం మీకు అండగా నిలుస్తుంది. అయితే కొన్ని పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించాలి. విష్ణు నామస్మరణ చేస్తే శుభం కలుగుతుంది.

మీనం

ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వాటినే బుద్ధి కుశలతతో అధిగమించాలి. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా మరింత దృఢంగా ఉండాలి. ఇష్టదేవతలను ఆరాధిస్తే మంచి కలుగుతుంది. Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌