Horoscope Today: ఈ రోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉంది.. ఏ రాశివారి పనులలో జాప్యం జరుగుతుంది… తెలుసుకుందాం

Horoscope Today (August 29th 2021): రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారిలో మనలో చాలా మందే ఉంటారు. రాశి ఫలాలను బేస్‌ చేసుకొని కొత్త పనులను మొదలు పెట్టడం, లేదా వాయిదా వేసుకోవడం..

Horoscope Today: ఈ రోజు ఏ రాశివారికి అనుకూలంగా ఉంది.. ఏ రాశివారి పనులలో జాప్యం జరుగుతుంది... తెలుసుకుందాం
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Aug 29, 2021 | 8:23 AM

Horoscope Today (August 29th 2021): రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారిలో మనలో చాలా మందే ఉంటారు. రాశి ఫలాలను బేస్‌ చేసుకొని కొత్త పనులను మొదలు పెట్టడం, లేదా వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. మరి ఈరోజు ఆగస్టు 29 ఆదివారం రోజున మీ రాశి ఫలం ఎలా ఉందో ఓసారి తెలుసుకోండి.

మేషరాశి:

మేషరాశి వారికి ఈరోజు కొంత నిరాశజనితంగా ఉంది. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి.

వృషభ రాశి:

ఈ రాశి వారు అనవసర భయాందోళనకు గురవుతారు. అనారోగ్య బాధలు అధిమవుతాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబంలోని స్త్రీల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.

మిథున రాశి:

మిథున రాశి వారికి ధన నష్టం కలిగే అవకాశం ఉంది.  ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మేలు. స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. సన్నిహితులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:

ఈ రాశి వారికీ ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి శుభఫలితాలను ఇస్తుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది.

సింహ రాశి:

సింహ రాశి వారి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. బంధు మిత్రులను కలుస్తారు. అనుకోని ధనలాభం ఉంటుంది. ఋణం తీర్చే ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.

కన్యా రాశి:

ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితను పొందుతారు. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి.

తుల రాశి:

తులా రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది.  వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. వృధా వ్యయప్రయాసల వలన ఆందోళన చెందుతారు. స్త్రీ వలన అనుకొకుండా ధనలాభం ఉంటుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి ఈరోజుఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ, క్రీడారంగంలో వారికీ అద్భుతమైన అవకాశాలున్నాయి. బంధు మిత్రులను కలుస్తారు.  . వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈరోజు పనుల్లో ప్రతికూలత ఎదుర్కొంటారు. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్పల్ప అనారోగ్యబాధలుంటాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంతమేర నిరాశ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.

మకర రాశి:

ఈ రాశి వారికీ ఈరోజు శుభకార్య ప్రయత్నాలకు అనుకూలం. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం ఉంది. నూతన వృత్తి, వ్యాపారాల్లో తగిన సమీక్షలు ఏర్పాటు చేసుకుంటారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు.

కుంభ రాశి:

కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా ఒంత ఒడిదుడుకులు కనిపించేలా ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాలి. తినే ఆహరం వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. అనవసర భయాందోళనలకు దూరంగా ఉండడం మంచిది.

మీన రాశి:

ఈ రాశి వారికి ఈ రోజు ప్రతికూలాంశాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తపడడం మంచిది.  ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సుదర్శన స్వామి వారి నామస్మరణ మేలు చేస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి.

Also Read:  కృష్ణుడు భోగిగా కనిపించే యోగి.. అందుకు చిహ్నమే కన్నయ్య తలపై ‘నెమలి పించం’