Krishna-Peacock Feather: కృష్ణుడు భోగిగా కనిపించే యోగి.. అందుకు చిహ్నమే కన్నయ్య తలపై ‘నెమలి పించం’
Krishna-Peacock Feather: మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర.. హిందువుల దేవుళ్లలో శ్రీ కృష్ణుడిది ప్రత్యేక స్థానం. విష్ణువు పది అవతారా;ల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారంగా భావించి పూజిస్తున్నారు. దేవకి గర్భాన జన్మించి..
Krishna-Peacock Feather: మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర.. హిందువుల దేవుళ్లలో శ్రీ కృష్ణుడిది ప్రత్యేక స్థానం. విష్ణువు పది అవతారా;ల్లో శ్రీ కృష్ణుడు ఎనిమిదవ అవతారంగా భావించి పూజిస్తున్నారు. దేవకి గర్భాన జన్మించి యశోద ఇంట పెరిగిన నల్లనయ్య లీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు కృష్ణుడు భక్తులు. దేశంలో వివిధ రూపాల్లో పూజలందుకుంటున్న కన్నయ్య రూపం కూడా ఆకర్షణీయమే. నెత్తిమీద నెమలి పింఛం, చేతిలో పిల్లన గ్రోవితో చూడచక్కగా ఉన్నాడు.. ఇక కృష్ణుడి తలమీద నెమలి పింఛం ఎందుకు ఉంది.. విశిష్టత ఏమిటంటే..
కృష్ణుడి 8 మంది భార్యలు..ఇక ప్రేమించింది పదహారు వేల మంది గోపికలను. అయితే ఈ గోపికలతో శ్రీకృష్ణుడు అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏనాడు ఆయన తన చనువుని అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.
ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి. నెమళ్ళకు తమ వీర్యాన్నీ ఊర్ద్వముఖంగా నడిపించినగల శక్తి గలవి. నెమలి రేతస్సు (వీర్యం) పల్చటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా బయటకు స్రవించబడి ఒక రకమైన మదపువాసను చిమ్మి ఆడనెమలిని ఆకర్షిస్తుంది. ఈ మదజలం, ఈ పతనమైన వీర్యం ద్వారా ఆడ నెమలి గర్బం ధరిస్తుంది. ఇక్కడ నెమలి గర్భం ధరించడం మానసికమైంది. నెమలి ఈక అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇక నెమలి అందమే పింఛం. క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.
అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించారు. అష్టభార్యలు, 16వేలమంది గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు.. అస్కలిత బ్రహ్మచారి శ్రీ కృష్ణుడు. అంటే స్కలనం అనేది ఎరుగనివాడు కనుకనే ఆయన అత్యంత పవిత్రుడు. భోగిగా కనిపించే యోగీశ్వరుడు.. అందుకే అందుకే కృష్ణుడు తలపై నెమలీక ధరిస్తాడు. నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.