Maha Purusha Yoga: ఉచ్ఛ స్థితిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి మహా పురుష యోగం..!
Wealth and Properity Astrology: ప్రస్తుతం మీన రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు కొన్ని రాశుల వారికి మాలవ్య మహా పురుష యోగాన్ని.. మరికొన్ని రాశుల వారికి మహా భాగ్య యోగాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇది మే 31 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ఆర్థిక ప్రగతి, ఉద్యోగంలో పదోన్నతులు, కుటుంబ సుఖం వంటి శుభ ఫలితాలు అనేక రాశులకు కలుగుతాయి.

Maha Purusha Yoga
ప్రస్తుతం మీన రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న శుక్రుడికి మరింతగా బలం పెరిగింది. తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన శనితో కలిసి ఉండడంతో పాటు, శని నక్షత్రమైన ఉత్తరాభాద్రలో సంచారం చేస్తున్నందువల్ల శుక్రుడు తప్పకుండా శుభ యోగాలను అనుగ్రహించే అవకాశం ఉంది. శుక్ర గ్రహం 1, 4, 7, 10 స్థానాల్లో ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడుమాలవ్య మహా పురుష యోగం కలుగుతుంది. ధన, లాభ స్థానాల్లో ఉన్నప్పుడు మహా భాగ్యాలు కలుగుతాయి. దాని ప్రకారం మిథునం, కన్య, ధనుస్సు, మీన రాశులకు మాలవ్య మహా పురుష యోగం కలుగుతుండగా, వృషభం, కుంభరాశులకు మహా భాగ్య యోగం కలుగుతోంది. ఈ యోగదాయక పరిస్థితులు మే 31 వరకూ కొనసాగుతాయి.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడు తనకు మిత్రుడైన శనీశ్వరుడితో కలవడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగు తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- మిథునం: ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనూ, ఆదాయంలోనే కాకుండా సామాజికంగా కూడా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది.
- కన్య: ఈ రాశికి సప్తమ కేంద్రంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల మాలవ్య మహా పురుష యోగం కలిగింది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఆదాయం వృద్ది చెందుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శుక్రుడి ఉచ్ఛస్థితి వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం కలిగింది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. సొంత ఇంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి శనితో యుతి చెందడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులే షన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో విపరీత రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరు కుంటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనారోగ్యాల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది.



