- Telugu News Photo Gallery Spiritual photos These are the zodiac signs that buy the most gold on Akshaya Tritiya
అదృష్టం తీసుకొస్తున్న అక్షయతృతీయ..అత్యధిక బంగారం కొనే రాశులివే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సారి అక్షయతృతీయ చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే? ఆరోజున అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి.ఈ సారి అక్షయతృతీయలో గజకేసరి రాజయోగం, లక్ష్మీ నారాయణ యోగం ,సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడనుంది. దీంతో ఇది ఐదు రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Apr 21, 2025 | 2:00 PM

వృషభ రాశి : ఈ రాశి వారికి అక్షయ తృతీయ చాలా శుభప్రదం. ఈ రాశిలోని వారు అత్యధిక లాభాలు పొందుతారు. అంతే కాకుండా అమ్మకాలు పెరుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్థులు పదోన్నతి పొందుతారు. అంతే కాకుండా అక్షయ తృతీయ రోజున వీరు ఎక్కువ బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారు చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు. బంగారం, వెండి లేదా రియలెస్టేట్ రంగంలో పని చేసే వారు అత్యధిక ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. అన్నింటా కలిసి వస్తుంది.

తుల రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తుల రాశి వారికి అక్షయ తృతీయ చాలా శుభ ప్రదమైనది. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు. ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది.

మకర రాశి : ఈ రాశి వారికి అక్షయ తృతీయ రోజున ఆర్థికంగా బాగుంటుంది. వీరికి లక్ష్మీ దేవిచ శని దేవుని ప్రత్యేక ఆశిస్సుల వలన కలిసి వస్తుంది. ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కుంభ రాశి : ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందే సూచనలు ఉన్నాయి. కెరీర్ లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంటా బయట సంతోషక వాతావరణం ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆనందంగా గడుపుతారు.



