- Telugu News Photo Gallery Spiritual photos Akshaya Tritiya 2025: Financial Gains and Prosperity for These Zodiac Signs
అక్షయ తృతీయతో వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
Akshaya Tritiya 2025: ఈ నెల 30న వచ్చే అక్షయ తృతీయ పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. ఆ రోజున వృషభ రాశిలో ఉచ్ఛ చంద్రుడు, గురువు కలయిక వల్ల గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఆరాధించినా, ఇంట్లో ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నా మే 31 లోపల కొన్ని రాశుల వారు తప్పకుండా ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం కలుగుతుంది. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశుల వారు దాదాపు ప్రతి విషయంలోనూ విశేషమైన పురోగతి సాధిస్తారు.
Updated on: Apr 21, 2025 | 5:57 PM

మేషం: ఈ రాశివారికి అక్షయ తృతీయ రోజున ధన స్థానంలో గజకేసరి యోగం కలుగుతున్నందువల్ల ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైన తప్పకుండా అంచనాలకు మించిన ఫలితాలనిస్తుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభాల్లో దూసుకుపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది.

వృషభం: ఈ రాశిలో గజకేసరి యోగం చోటు చేసుకోవడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు జోరుగా, హుషారుగా సాగిపోతాయి. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలున్నాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడంతో పాటు, ధన కారకుడైన గురువుతో కలవడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో లాభాధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం, గురువుతో యుతి చెందడం వల్ల గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు లాభాల పంట పండిస్తాయి. అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల వంటి శుభ కార్యాలు జరుగుతాయి.

మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉచ్ఛ చంద్రుడితో గురువు కలయిక వల్ల ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మీ సమర్థతకు ఊహించని గుర్తింపు లభిస్తుంది. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మీనం: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ చంద్రుడితో కలవడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలమవుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగులకు తప్పకుండా పదో న్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో అత్యధికంగా లాభాలు పొందు తారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.



