Horoscope Today: వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Daily Horoscope (August 10): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 10, 2023న(గురువారం)న 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

Horoscope Today: వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope 10th August 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 10, 2023 | 5:01 AM

Daily Horoscope (August 10): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు మీ జాతకచక్రానికి అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం, ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? ఉద్యోగపరంగా మీ రాశికి ఫలితాలు ఎలా ఉంటాయి? ఆగస్టు 10, 2023న (గురువారం)న 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. మీరిచ్చిన సలహాల వల్ల బంధుమిత్రులు ఆశించిన ప్రయోజనం పొందుతారు. విద్యా ర్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): పెండింగ్ పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు చేయూతనందిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమలు ఊపందుకుంటాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవ కాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. ఇప్పుడు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మీ వల్ల అధికారులు లాభపడతారు. వృత్తి, వ్యాపారాల్లో బిజీ అయ్యే సూచనలున్నాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): కుటుంబపరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. కుటుంబ సమస్యల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. బాగా ఒత్తిడికి గురవుతారు. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుం డదు. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. సమా జంలో మంచి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత మంచిది. ప్రేమలో ఇబ్బందులు ఎదురవు తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇంటా బయటా పనిభారం వల్ల మనస్సు స్తిమితంగా ఉండదు. కుటుంబ వ్యవహారాలను చక్క దిద్దాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కూడా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను మధ్యలోనే నిలిపేయాల్సి వస్తుంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూలంగానే ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ప్రతి చిన్న పనికీ ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను స్వయంగా చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధాల విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలి స్తాయి. చదువుల్లో పిల్లల పనితీరు పరవాలేదనిపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రోజంతా సాఫీగా సాగిపోతుంది. సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడడం, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. కొద్ది ప్రయ త్నంతో కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చు పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా దేనికీ ‘మూడ్’ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. గట్టిగా ప్రయత్నిస్తే ఈ సమ స్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపా రాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. చేపట్టిన ప్రతి పనీ సకాలంలో సంతృప్తి కరంగా పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పిల్లల చదువుల విషయాలు ఆనందం కలిగిస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు, తల్లితండ్రుల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా గడుస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి చేయవద్దు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబపరమైన వ్యవహారాలను చక్కబెడతారు. ఉద్యోగంలో అధికారుల తీరు తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించినంతగా స్పందన లభించకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. కొద్దిగా చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా లాభాలు గడిస్తారు. ఒక్కొటొక్కటిగా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆదా యం బాగానే ఉన్నప్పటికీ, ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోకపోవడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగి పోతాయి.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుందని గమనించగలరు. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..