AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో జన్మించిన వారు పొరపాటున కూడా బంగారం ధరించవద్దు.. ఎందుకంటే

కొందరు సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీని నమ్ముతారు. తాము పుట్టిన తేదీప్రకారం సంఖ్యని గణించి జీవితంలో ఎలా ఉంటుంది? ఏమి చేస్తే శుభం .. ఏమి చేయడం అశుభం తెలుసుకుంటారు. ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించినది. ఈ కారణంగా నెలలోని కొన్ని తేదీలలో జన్మించిన వ్యక్తులు బంగారం ధరించడం శుభప్రదంగా పరిగణించబడదు. ఈ వ్యక్తులు బంగారం ధరిస్తే, అది హాని కలిగిస్తుందని నమ్ముతారు. బంగారం ధరించకూడని వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.

Numerology: ఈ తేదీల్లో జన్మించిన వారు పొరపాటున కూడా బంగారం ధరించవద్దు.. ఎందుకంటే
Numerology
Surya Kala
|

Updated on: May 29, 2025 | 3:59 PM

Share

జ్యోతిషశాస్త్రంలో బంగారం దేవ గురువు బృహస్పతి గ్రహంతో ముడిపడి ఉంది. ఈ గ్రహం డబ్బు, జ్ఞానం, శ్రేయస్సును సూచిస్తుంది. అదే సమయంలో నెలలోని కొన్ని తేదీలలో జన్మించిన వ్యక్తులు బంగారాన్ని ధరించకూడదు. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ఏదో ఒక గ్రహంతో ప్రత్యేక సంబంధం ఉంది. జన్మించిన నెల తేదీ.. జనన సంఖ్య ఆధారంగా సంఖ్యా శాస్త్రం గణిస్తారు. అంతేకాదు ఎవరైనా పుట్టిన తేదీ రెండు అంకెలు అయితే.. ఆ అంకెలను కూడితే వచ్చే మొత్తం మీ రాడిక్స్ అవుతుంది.

ఉదాహరణకు నెలలో 1 నుంచి 9 తేదీల మధ్య జన్మించిన వారి మూల సంఖ్య ఒకే సంఖ్యగా ఉంటుంది. అయితే నెలలో 10 మరియు 31 తేదీల మధ్య జన్మించిన వ్యక్తులకు వారి రాడిక్స్ .. తేదీ అంకెల మొత్తం అవుతుంది. ఉదాహరణకు 23వ తేదీన జన్మించిన వ్యక్తి మూల సంఖ్య (2+3=5) (5) అవుతుంది. వ్యక్తులు 29వ తేదీన జన్మించినట్లయితే వీరి రాడిక్స్ మొత్తం రెండు అంకెలను కలిపితే (2+9=11).. (1+1=2) అంటే అటువంటి 29వ తేదీలో జన్మించిన వ్యక్తుల రాడిక్స్ (2) అవుతుంది.

బృహస్పతికి బంగారానికి సంబంధం

ఇవి కూడా చదవండి

బంగారం బృహస్పతి గ్రహానికి చిహ్నం. కనుక బృహస్పతితో మంచి సమన్వయం లేని ఏ గ్రహమైనా.. ఆ గ్రహం రాడిక్స్ ఉన్నవారు బంగారం ధరించకూడదు. అలాంటి వ్యక్తులు బంగారం ధరిస్తే మానసిక ఒత్తిడి, డబ్బు కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు లేదా సంబంధాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నేపధ్యంలో ఈ రోజు న్యూమరాలజీ ప్రకారం ఏ తేదీలలో పుట్టిన వారు బంగారం ధరించకూడదు ? దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.

సంఖ్య 2 (నెలలో 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

2వ సంఖ్యకు అధిపతి చంద్రుడు. చంద్రుడు, బృహస్పతి మధ్య సంబంధం మధ్యస్థంగా ఉంటుంది. అయితే ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే లేదా శని, రాహువు వంటి గ్రహాల ప్రభావం ఉంటే, బంగారం ధరించడం వల్ల హాని కలుగుతుంది. ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు బంగారం ధరించడం వల్ల మనస్సులో అశాంతి ఏర్పడుతుంది. సంబంధాలలో అపార్థాలు ఏర్పడతాయి లేదా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలు కూడా సంభవించవచ్చు.

వీరు చేయాల్సిన పరిహారం: ఉదయం శివుడికి పాలు, నీరు సమర్పించండి. వెండి ఉంగరం లేదా గొలుసు ధరించండి. జాతకంలో చంద్రుడి బలపడతాడు.

6వ సంఖ్య (నెలలో 6, 15, 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

6వ సంఖ్యకు అధిపతి శుక్రుడు. జ్యోతిషశాస్త్రంలో రాక్షస గురువు శుక్రుడు, దేవ గురువు బృహస్పతి కి మధ్య సంబంధాలు మంచిగా పరిగణించబడవు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నా.. లేదా బృహస్పతితో చెడు కలయిక ఏర్పడినా.. ఈ సంఖ్యకి చెందిన వ్యక్తులు బంగారం ధరించడం వల్ల ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు, సంబంధాలలో ఉద్రిక్తత లేదా డబ్బు నష్టం సంభవించవచ్చు. ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు బంగారం ధరించడం వల్ల చర్మ సమస్యలు లేదా అలసటను ఎదుర్కొంటారు.

6వ సంఖ్య వారు చేయాల్సిన పరిహారం– లక్ష్మీ దేవిని పూజించి, ‘ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః’ అని 11 సార్లు జపించాలి. చిన్న వెండి లేదా వజ్రాల ఆభరణాలు ధరించండి.

8వ సంఖ్య (నెలలో 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తులు)

8వ సంఖ్యకు అధిపతి శనీశ్వరుడు. సూర్యుడు, ఛాయల తనయుడు శనీశ్వరుడు కూడా బృహస్పతికి శత్రువుగా భావిస్తారు. 8, 17, 26 తేదీలలో జన్మించిన వారికి బంగారం ధరించడం వల్ల ఉద్యోగ అంతరాయాలు, ఎముకలు లేదా కీళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు వస్తాయి. జాతకంలో శని బలహీనంగా ఉంటే లేదా బృహస్పతితో చెడు స్థితిలో ఉంటే.. బంగారం ధరించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

8వ సంఖ్య వారు చేయాల్సిన పరిహారం– శనీశ్వరుడికి ఆవ నూనె లేదా నువ్వుల నూనెను సమర్పించి, ‘ఓం శం శనైశ్చరాయ నమః’ అని 11 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నూనెను దానం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ