AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు మస్తు తెలివైనోళ్లు తెలుసా..? జీవితంలో మస్తు పైకొస్తరు..!

సంఖ్యాశాస్త్రం అనేది వ్యక్తి జన్మతేది ఆధారంగా వారి స్వభావం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనా వేసే ఒక పద్ధతి. ప్రతి సంఖ్యకు ఓ ప్రత్యేకత ఉంటుంది. పుట్టిన తేదీని మొత్తం కలిపి ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్యనే మూల సంఖ్య అంటారు. ఇది 1 నుంచి 9 వరకు ఏదైనా ఒకటి కావచ్చు. ప్రతి మూల సంఖ్యకు ఓ గ్రహ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహం వల్ల పిల్లల ప్రవర్తన మీద ప్రత్యేకమైన ప్రభావం కనిపిస్తుంది.

Numerology: ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు మస్తు తెలివైనోళ్లు తెలుసా..? జీవితంలో మస్తు పైకొస్తరు..!
Numerology Secrets
Prashanthi V
|

Updated on: May 29, 2025 | 5:35 PM

Share

ఏ నెలలోనైనా 3, 12, 21 లేదా 30 తేదీలలో జన్మించినవారి మూల సంఖ్య 3 అవుతుంది. దీనికి పాలక గ్రహం బృహస్పతి. ఈ సంఖ్య వచ్చినవాళ్లు తెలివిగా ఉంటారు. చదువులో బాగా రాణించడమే కాకుండా.. ఇతర రంగాలలో కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు.

ఈ సంఖ్యలో పుట్టిన పిల్లలకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఒకసారి చూసిన విషయాన్ని వెంటనే గుర్తుపెట్టుకుంటారు. మళ్లీ మర్చిపోవడం చాలా అరుదు. ఇది వారికి చదువులో మంచి ఉపయోగం అవుతుంది. ఇతర పిల్లలతో పోలిస్తే వారు త్వరగా విషయాలు నేర్చుకుంటారు.

3వ తేదీలో పుట్టిన పిల్లలు సృజనాత్మక ఆలోచనలతో ఉండటం ప్రత్యేకత. వారు సాధారణంగా కొత్తగా ఆలోచించగలగడం వల్ల, గణితం, సైన్స్, ఆర్ట్స్ లాంటి రంగాలలో కొత్త దారులు వెతకగలరు. వారి ఊహా శక్తి వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది.

ఈ సంఖ్యలో జన్మించిన పిల్లల ప్రవర్తన ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. వారు మాట్లాడే శైలి వినసొంపుగా ఉంటుంది. ఎవరితోనైనా స్నేహంగా మెలగగలుగుతారు. బహిరంగంగా మాట్లాడే ధైర్యం ఉంటుంది. ఇది వారికి చిన్న వయస్సులోనే మంచి నెట్‌ వర్క్‌ ను ఏర్పరచడానికి సహాయం చేస్తుంది.

ఈ సంఖ్యలో పుట్టినవారికి పరిపాలనా ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది. వారు పెద్దయ్యాక ఆదాయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరు. సమయానుకూలంగా సంపద కూడా పెరుగుతుంది. చురుకుగా పనిచేసే వారు కావడం వల్ల ఎక్కడైనా గుర్తింపు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ సంఖ్యలో పుట్టిన పిల్లల తెలివితేటలు గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. వారి ఆలోచనలకు అవకాశం కల్పించాలి. వారిలో ఉన్న సృజనాత్మకతను ముందుకు నడిపేందుకు మార్గం చూపాలి. అప్పుడే వారు జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు.

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు