AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Ketu Transit: నేటి నుంచి రాహు, కేతు శుభ ప్రభావం.. ఈ రాశుల వారికి ఏడాదిన్నర పాటు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులు చాయ గ్రహాలు. ఈ రాహువు, కేతువులు మే 18న కుంభ , సింహ రాశిలోకి ప్రవేశించారు.అయితే రాహువు, కేతువుల స్పష్టమైన సంచారము మే 29న జరగబోతోంది, దీని కారణంగా రానున్న ఒకటిన్నర సంవత్సరాలు కొన్ని రాశులకు స్వర్ణకాలం అవుతుంది. ఆ అదృష్ట రాశులుఏమిటి? ఈ సంచారంతో ఎన్ని లాభాలను పొందుతారో.. ఈ రోజు తెలుసుకుందాం.

Rahu Ketu Transit: నేటి నుంచి రాహు, కేతు శుభ ప్రభావం.. ఈ రాశుల వారికి ఏడాదిన్నర పాటు పట్టిందల్లా బంగారమే..
Rahu Ketu Transit May 2025
Surya Kala
|

Updated on: May 29, 2025 | 6:32 PM

Share

రాహువు , కేతువు రెండూ ఛాయా గ్రహాలు, ఈ గ్రహాలు ఇప్పటికే 18 మే 2025న కుంభ , సింహ రాశిలో అడుగు పెట్టాయి. అయితే ఈ రాశుల్లో రాహు, కేతువులు స్పష్టమైన సంచారము ఈ రోజు (మే 29న) రాత్రి 11:03 గంటలకు జరగనుంది. దీని తరువాత రాహు-కేతువులు కుంభ , సింహ రాశిలో స్పష్టంగా సంచరిస్తారు. ఈ రాశులపై రాహు, కేతు ప్రభావం డిసెంబర్ 5, 2026 వరకు ఉంటుంది.

ఈ రెండు గ్రహాలు క్రూరమైన గ్రహాల వర్గంలోకి వస్తాయి. అందుకే వీటి సంచారము జీవితంలో ఆకస్మిక మార్పులను తెస్తుంది. ఈ ప్రభావాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. శుభప్రదమైనవి. అశుభకరమైనవి. అయితే కొన్ని రాశులు ఈ సంచారము వలన 18 నెలల పాటు శుభ ఫలితాలను పొందుతాయి. ఈ రాశులకు ఈ సమయంలో విజయావకాశాలను తెస్తాయి. ఈ రోజు

రాహువు కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు కుంభరాశికి అధిపతి. శనీశ్వరుడు కర్మను ఇచ్చేవాడు అంటే కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు. కనుక కృషి , క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే రాహువు ప్రభావం కొన్ని రాశుల వారికి అన్ని విధాలా మేలు చేస్తుంది. ప్రతిష్టాత్మక ప్రణాళికలు, సామాజిక సంస్కరణలను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

కేతువు ఇప్పటికే సింహ రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఆయనను నాయకత్వం , స్వీయ-అవగాహనకు చిహ్నంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో రానున్న 18 నెలల పాటు కొన్ని ఈ రాశులకు చెందిన వ్యక్తులు శుభ ఫలితాలను ఇస్తుంది. వీరికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. అదృష్టం పెరుగుతుంది. అదృష్టం పొందే ఈ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

తులా రాశి: తులారాశికి అధిపతి శుక్రుడు. రాహువు ఐదవ ఇంట్లో, కేతువు పదకొండవ ఇంట్లో ఉన్నారు. కనుక వీరు జీవితంలో ప్రేమను అనుభవిస్తారు. ఈ సమయం ఉద్యోగం , వ్యాపారం రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వారి ప్రతిష్ట పెరుగుతుంది.

మేషరాశి: మేష రాశి వారిని కుజుడు పాలిస్తాడు. ఈ సమయంలో ఈ రాశిచక్రంలోని 11వ ఇంట్లో రాహువు, ఐదవ ఇంట్లో కేతువు సంచరించనున్నాడు. ఈ కలయిక ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆదాయ వనరులను తెరుస్తుంది. విద్య, వ్యాపారంలో ప్రయోజనాలు ఉంటాయి. దీనితో పాటు ఈ సమయం ప్రేమ సంబంధాలకు కూడా మంచిది.

మిథున రాశి: మిథున రాశి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి రాహువు తొమ్మిదవ ఇంట్లో, కేతువు మూడవ ఇంట్లో ఉన్నారు. దీని కారణంగా వీరు ఈ ఒకటిన్నర సంవత్సరంలో తమ పనిలో విజయం సాధిస్తారు. పురోగతి, పదోన్నతి అవకాశాలు ఉంటాయి. వ్యాపారం విస్తరిస్తుంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి అధిపతి బృహస్పతి. రాహువు వీరి జాతకంలో మూడవ ఇంట్లో , కేతువు తొమ్మిదవ ఇంట్లో ఉంటారు. కనుక ఈ సమయం మీ అదృష్టానికి సరైన సమయం అవుతుంది. వీరికి తమ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..