Brown Sugar vs. White Sugar: వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి మంచిదని తెగ తినేస్తున్నారా..! నిపుణుల సలహా ఏమిటంటే..
పంచదార అంటే ఎక్కువ మందికి తెల్ల రంగులో ఉండేది తెలుసు.. పంచదారలో బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ రెండూ రకాలున్నాయని తెలుసా.. వీటిని తయారు చేసే విధానం, రుచిలో తేడాలున్నాయి. వైట్ షుగర్ అధికంగా శుద్ధి చేయబడుతుంది. దీంట్లో మొలాసిస్ ఉండదు కనుక తెలుపు రంగులో ఉంటుంది. ఇక వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ తక్కువగా ప్రాసెస్ చేస్స్తారు. దీనిలో కొద్దిగా మొలాసిస్ ఉంటుంది కనుక బ్రౌన్ షుగర్‌కు ప్రత్యేకమైన రంగు, రుచిని ఇస్తుంది. అయితే ఆరోగ్యానికి బ్రౌన్ షుగర్ మంచిదా వైట్ షుగర్ మంచిదా తెలుసుకుందాం..

భారతీయుల జీవితాల్లో స్వీట్లు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువగా స్వీట్లను చక్కెరతో తయారు చేస్తారు. ఈ పంచదారతో చేసిన పదార్ధాలను తినడం వలన ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు పంచదారను ఉపయోగించే విషయంలో కొంచెం స్పృహలోకి వచ్చారు. దీంతో ఇప్పుడు వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తున్నారు. అయితే బ్రౌన్ షుగర్ నిజంగా తెల్ల చక్కెర కంటే మంచిదా? లేదా ఇది ఆరోగ్యం పేరుతో ఉన్న మరో అపోహ మాత్రమేనా? అనే విషయం గురించి ఈ రోజు తెలుసుకుందాం.
బ్రౌన్ షుగర్ మరియు వైట్ షుగర్ మధ్య తేడా ఏమిటి?
తెల్ల చక్కెరను శుద్ధి చేస్తారు. దీంతో దీనిలోని అన్ని ఖనిజాలు, ఫైబర్‌ను తొలగిస్తుంది. మరోవైపు, బ్రౌన్ షుగర్ తెల్ల చక్కెర కంటే తక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. దానికి తక్కువ మొత్తంలో బెల్లం జోడించబడుతుంది. దీంతో లేత గోధుమ రంగు , భిన్నమైన రుచిని ఇస్తుంది.
బ్రౌన్ షుగర్ తో ఆరోగ్య ప్రయోజనాలు
బ్రౌన్ షుగర్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్ , మెగ్నీషియం వంటి కొన్ని ఖనిజాలు ఉన్నాయి. అయితే వీటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. బ్రౌన్ షుగర్ శరీరానికి భారీ పోషణను అందిస్తుందని మీరు అనుకుంటే.. అది నిజం కాదు.
బ్రౌన్ షుగర్ తక్కువగా ప్రాసెస్ చేయబడుతుంది. కనుక ఇందులో తక్కువ రసాయనాలు ఉన్నాయి. దీని వలన ఇది కొంచెం మెరుగైన ఎంపికగా మారింది. అంతేకాని బ్రౌన్ షుగర్ సూపర్ ఫుడ్ కాదు.
కొన్ని వంటలలో రుచిగా ఉండే మొలాసిస్ ఉండటం వల్ల బ్రౌన్ షుగర్ ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా పెద్దగా ప్రయోజనం చేకూర్చదు.
బ్రౌన్ షుగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుందా?
బ్రౌన్ షుగర్ బరువు నియంత్రణకు సహాయపడుతుందనేది ఒక అపోహ. నిజం ఏమిటంటే ఇందులో తెల్ల చక్కెరతో సమానమైన కేలరీలు ఉన్నాయి. ఎవరైనా బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, పరిమిత పరిమాణంలో బ్రౌన్ షుగర్ తీసుకోండి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏది మంచిది?
బ్రౌన్ షుగర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తెల్ల చక్కెర మాదిరిగానే ఉంటుంది. అంటే ఇది చక్కెర స్థాయిని కూడా వేగంగా పెంచుతుంది. కనుక డయాబెటిక్ రోగులు రెండింటినీ దూరంగా పెట్టాలి.
బ్రౌన్ షుగర్ ఖచ్చితంగా తెల్ల చక్కెర కంటే మంచిది. అయితే బ్రౌన్ షుగర్ ఆరోగ్యకరమైనది అని చెప్పడం తప్పు అని అంటున్నారు నిపుణులు. ఆరోగ్యం నిజంగా ముఖ్యమైతే.. ఏ రకమైన చక్కెరనైనా వీలైనంత తక్కువగా తీసుకోండి. అది తెలుపు లేదా గోధుమ రంగు అయినా సరే.. జీవితంలో స్వీట్లను తినాలి. అయితే పరిమిత పరిమాణంలో తినడం ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








