Kitchen Hacks: అల్లంని ఇలా నిల్వ చేయండి.. మస్తు రోజులు ఫ్రెష్ గా ఉంటుంది..!
అల్లం ప్రతి ఇంట్లో వాడే పదార్థం. దీనితో వంటలు బాగా రుచిగా మారతాయి. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. కానీ అల్లాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే అది త్వరగా చెడిపోతుంది. దీంతో డబ్బు, పదార్థం వృథా అవుతుంది. కాబట్టి అల్లం నిల్వ చేయడంలో తెలివిగా ఉండాలి.

అల్లం తినడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉదయం టీకి ఇది ఒక ముఖ్యమైన భాగం. కడుపు నొప్పి, వాంతులు వచ్చినప్పుడు అల్లం ఉపశమనంగా పని చేస్తుంది. రోజు రోజుకు ఎక్కువగా వాడటంతో.. చాలా మంది ఇది ఎక్కువ మొత్తంలో కొంటారు. కానీ నిల్వ చేయడంలో తేడా ఉంటే.. అది వృథా అవుతుంది.
మార్కెట్ లో కొనుగోలు చేసిన తర్వాత అల్లం తడిగా ఉంటే దానిని నేరుగా పెట్టకండి. తడిగా ఉంచితే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. అల్లాన్ని మొదట ఆరబెట్టి తర్వాత నిల్వ చేయండి. అలా చేస్తే అది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.
అల్లం తాజాగా ఉండాలంటే ఫ్రిజ్ లో ఉంచడం మంచిది. అయితే నేరుగా ఫ్రిజ్ లో ఉంచొద్దు. కాగితం లేదా టిష్యూ పేపర్ లో చుట్టి తర్వాత ప్లాస్టిక్ కవర్లో పెట్టాలి. లేదా గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. అల్లం ముక్కల్ని శుభ్రంగా తుడిచి బాగా ఆరబెట్టి కాగితం లేదా టిష్యూలో చుట్టి పెట్టండి. ఇలా చేస్తే చాలా రోజులు పాడవకుండా ఉంటుంది.
ఫ్రిజ్ లేనప్పటి రోజుల్లో పెద్దలు అల్లం ముక్కల్ని ఎండలో పెట్టేవారు. బాగా ఎండిన తర్వాత వాటిని రుబ్బుకొని పొడిగా తయారు చేసేవారు. ఆ పొడిని గాలి చొరబడని డబ్బాలో పెట్టేవారు. ఇది తేమ లేకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పద్ధతి.
ఇంకో పద్ధతి అల్లంను తురిమి పేస్ట్ చేయడం. అల్లం ముక్కల్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ పేస్ట్ ను చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇలా తయారు చేస్తే ప్రతి సారి అల్లం తుంచాల్సిన పనిలేకుండా అవుతుంది.
అల్లం వంటల్లో రుచికి తోడూ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ నిల్వ చేయడంలో జాగ్రత్తలు అవసరం. పై చిట్కాలు పాటిస్తే అల్లాన్ని ఎక్కువ రోజుల పాటు పాడవకుండా ఉంచవచ్చు. మీరు కూడా ఈ పద్ధతులు పాటించి అల్లాన్ని మెరుగుగా ఉపయోగించండి.




