AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Prasadam: జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. బత్తిన సోదరుల చేప ప్రసాదానికి 185 ఏళ్ల చరిత్ర

ప్రతి ఏటా బత్తిన సోదరుల చేప ప్రసాదానికి భక్తులు అత్యధికంగా తరలివస్తారు.185 సంవత్సరాల క్రితం బత్తిన సోదరుల కుటుంబం చేప ప్రసాదం పంపిణీ మొదలుపెట్టారు. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరుల చేప ప్రసాదం బాగా పనిచేస్తుందనేది అందరికీ ఉన్న విశ్వాసం. మొదట్లో ఈ చేప ప్రసాదాన్ని చేప ముందుగా పిలిచేవారు

Fish Prasadam: జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. బత్తిన సోదరుల చేప ప్రసాదానికి 185 ఏళ్ల చరిత్ర
Battina Brothers Fish Prasadam
Sravan Kumar B
| Edited By: Surya Kala|

Updated on: May 29, 2025 | 5:58 PM

Share

కొంతమంది చేప మందు పంపిణీ విషయంపై చర్చ మొదలుపెట్టి డాక్టర్ నిర్ధారించకుండా బత్తిన సోదరుల ప్రసాదాన్ని చేపమందుగా ఎలా పిలుస్తారని మెడికల్ లా కి ఇది వ్యతిరేకమని వాధించటంతో బత్తిన సోదరుడు చేప మందును చేప ప్రసాదంగా పిలవడం మొదలుపెట్టారు. దీనికోసం హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి ఏటా భారీ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. చేప ప్రసాదానికి లక్షల్లో తరలిరావడంతో ప్రభుత్వం తరఫునుంచి భారీ ఏర్పాట్లు జరుగుతుంటాయ. ఈ ఏడాది జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుందని దీనికోసం ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 1.5 లక్షల చేప పిల్లలను బత్తిన సోదరులకు ప్రసాద కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది.

భక్తులకు ప్రత్యేక భారీకేట్లు, మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఇవ్వాలని సూచించారు. దీంతోపాటు ఈ చేప ప్రసాదానికి వీఐపీల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దేశం నలుమూలల నుంచి వీఐపీలు ఈ ప్రసాదం కోసం వస్తుంటారు. అయితే సామాన్య భక్తులకు ఎక్కువ అవకాశం కల్పించాలని ఈసారి విఐపి పాసులను చాలా లిమిట్ గా ఇవ్వనున్నారు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి వారికి సరిపడా తాగునీటి సౌకర్యాలు, టాయిలెట్స్, స్వచ్ఛంద సంస్థల నుంచి ఉచిత భోజన ఏర్పాట్లు సౌకర్యాలు ఉంటాయి కాబట్టి వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచన చేశారు హైదరాబాద్ ఇన్చార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. ఎక్సిబిషన్ గ్రౌండ్స్ చుట్టూ 10 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.వేల వాహనాలు వస్తున్నట్లు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వెహికల్ బ్రేక్ డౌన్ అయినప్పుడు తరలించేందుకు క్రేన్ వాహనాలను కూడా సిద్ధం చేశారు లక్షల మంది వస్తారు కాబట్టి జనాలకు ఈజీగా అర్థమయ్యే విధంగా సైన్ బోర్డు లు ఏర్పాటు చేయాలని సూచించారు. మొబైల్ టాయిలెట్స్ సానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇక చేప పిల్లల పర్యవేక్షణకు వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పర్యవేక్షణ ఉంటుందని అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కి సూచించారు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టూ దూద్ బౌలి, నాంపల్లిలో కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సూచన చేయటం జరిగింది. ఇక ఆర్టీసీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ,దాంతోపాటు మెట్రో స్టేషన్, ఎంఎంటీఎస్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి చేరుకునేలా ప్రత్యేకమైన రవాణా ఏర్పాటు భక్తుల కోసం చేయడం జరుగుతుంది. ఇక వాలంటీర్లకి సిపిఆర్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని హైదరాబాద్ ఇన్చార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రసాదం కోసం టోకెన్లకు అదనంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..