AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: స్త్రీలు ఈ లక్షణాలున్న పురుషులను ఇష్టపడతారట.. వీరే మంచి భర్తలు కూడా..

విష్ణు శర్మ, కౌటిల్యుడు అని కూడా పిలవబడే ఆచార్య చాణక్యుడు గొప్ప వ్యూహకర్త మాత్రమే కాదు.. మనిషి జీవితాన్ని ఎలా గడిపితే సుఖ సంతోషాలతో నిండి ఉంటుందో కూడా చెప్పిన గురువు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆయన చెప్పిన విషయాలు నేటి తరానికి కూడా అనుసరణీయం. నేటి యువతీయువకులకు ఆయన రచించిన నీతి శాస్త్రం ఒక రోడ్ మ్యాప్ వంటిది. చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గుణగణాలను మాత్రమే కాదు ఇష్టాఅయిష్టాలను గురించి కూడా వేలిపాడు. స్త్రీలు ఎటువంటి పురుషులను ఇష్టపడతారో కూడా వెల్లడించాడు.

Chanakya Niti: స్త్రీలు ఈ లక్షణాలున్న పురుషులను ఇష్టపడతారట.. వీరే మంచి భర్తలు కూడా..
Acharya Chanakya
Surya Kala
|

Updated on: May 29, 2025 | 2:51 PM

Share

ఆచార్య చాణక్యుడు గొప్ప రాజకీయ నాయకుడే కాదు..జీవితంలోని ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకున్న తత్వవేత్త కూడా. మానవ సంబంధాలు ఎలా ఏర్పడతాయో, విచ్ఛిన్నమవుతాయో, ఎలా నిలకడగా ఉంటాయో అర్ధం చేసుకున్న ఆయన తన తరవాత తరాల వారికీ నీతి శాస్త్రం వంటి పుస్తకం ద్వారా వాటిని అందించాడు. చాణక్య చెప్పిన ప్రకారం ఏ సంబంధంలోనైనా అతి ముఖ్యమైన విషయం నమ్మకం, పరస్పర అవగాహన. అయితే స్త్రీలు పురుషులను తమ జీవిత భాగస్వాములుగా అంగీకరించాలంటే వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆయన చెప్పారు. ఈ లక్షణాలు బాహ్యంగా కనిపించవు. అయితే వ్యక్తి ప్రవర్తన ,ఆలోచనలకు సంబంధించినవి. అలాంటి పురుషులు సమాజంలో గౌరవానికి అర్హులని, అటువంటి పురుషులతో సంబంధాలు కూడా బలపడతాయని చాణక్యుడు నమ్ముతాడు.

నిజాయితీ , సత్యం: ఆచార్య చాణక్యుడి ప్రకారం ఏదైనా సంబంధానికి పునాది సత్యం, నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. అబద్ధాలు చెప్పని పురుషులను స్త్రీలు ఇష్టపడతారు. ఎప్పుడు సత్యం చెప్పే పురుషులు ఏది చెప్పినా హృదయపూర్వకంగా చెబుతారని విశ్వసిస్తారు. కనుక సత్యం చెప్పే పురుషులను స్త్రీలు నమ్మడమే కాదు అటువంటి పురుషుడితో సంబంధం బలంగా ఉండేలా చూచుకుంటారు. నిజం చెప్పే వ్యక్తి మాటలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి.. కానీ అతను ఎప్పుడూ గొప్పలు చెప్పుకోరు.

గౌరవం ఎలా ఇవ్వాలో తెలిసిన వ్యక్తి.. స్త్రీలను, ఆమె భావాలను గౌరవించే పురుషుడు నిజ జీవిత భాగస్వామి అని పిలవబడటానికి అర్హుడు అని చాణక్య చెప్పాడు. స్త్రీలు తమను తక్కువ అంచనా వేయకుండా, తమను సమానంగా చూసే పురుషులను ఇష్టపడతారు. ఒక పురుషుడు తన తల్లిని, సోదరిని లేదా భార్యను గౌరవిస్తే..చాణక్య ప్రకారం అతను ప్రతి సంబంధాన్ని కొనసాగించడంలో నిపుణుడు.

ఇవి కూడా చదవండి

ఓర్పు, అవగాహన:ప్రతి సంబంధం ఒడిదుడుకులతోనే సాగుతుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా, ఓపికగా ఉండే పురుషుడిని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. తెలివిగా ఆలోచించి సమస్యలను పరిష్కరించుకునే అలవాటున్న గుణం స్త్రీలను చాలా ఆకర్షిస్తుంది. కోపంలో నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు తరచుగా సంబంధాలను నాశనం చేసుకుంటారు. అయితే ప్రశాంతంగా, వివేకంతో ఆలోచించే వ్యక్తులు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు.

తనకంటూ ఒక లక్ష్యం,దార్శనికత : జీవితంలో ఒక లక్ష్యం కలిగి ఉండటం చాలా ముఖ్యమని నమ్మాడు. కష్టపడి పనిచేసి కెరీర్‌లో లేదా జీవితంలో ఏదైనా సాధించాలనుకునే పురుషుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. తమ కలల కోసం కష్టపడి పనిచేసే పురుషులను మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటారు. లక్ష్యం లేకుండా జీవించే పురుషులు తరచుగా బాధ్యతల నుంచి పారిపోతారు.

పరిశుభ్రత, మంచి దుస్తులు ధరించడం: చాణక్యుడు కూడా పరిశుభ్రతను ఒక ముఖ్యమైన లక్షణంగా పరిగణించాడు. శుభ్రం ఉండి మంచి దుస్తులు ధరించే పురుషులను ఎక్కువగా స్త్రీలు ఇష్టపడతారు. ఈ విషయం అతని వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. పరిశుభ్రమైన మనిషి తనకు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నవారికి కూడా ఆనందాన్ని ఇస్తాడు.

హాస్య గుణం ఆచార్య చాణక్యుడి ప్రకారం కొంచెం హాస్యం , సరదాగా జోకులు వేస్తూ ఉండే వ్యక్తులను స్త్రీలు ఇష్టపడతారు. వీరి చెప్పే ఛలోక్తులు సంబంధాలకు మాధుర్యాన్ని జోడిస్తాయి. అయితే పురుషుల మాటలు అసభ్యకరంగా లేదా ఇతరులను అవమానించేలా ఉంటే.. అటువంటి సమయంలో ఆకర్షణకు బదులుగా ద్వేషాన్ని సృష్టిస్తుంది. మహిళలు సరదాగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు. కానీ హద్దులను పాటిస్తారు. తేలికైన జోకులు సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. మనసు బాధపడేటట్లు సమయం సందర్భం లేకండా అతిగా జోకులు వేయడం హానికరం.

భావోద్వేగపరంగా మద్దతు ఇచ్చేవారిని కష్ట సమయాల్లో తమకు మద్దతు ఇచ్చే వారిని మహిళలు ఇష్టపడతారు. స్త్రీలు చెప్పిన సమస్యలను విని, వాటిని అర్థం చేసుకునే పురుషులు నిజమైన భాగస్వాములు అవుతారని చాణక్య నమ్ముతాడు. సహాయక భాగస్వామి ప్రతి సంబంధాన్ని మరింత లోతుగా జీవించడానికి సహాయపడుతుంది. అలాంటి పురుషులు ఇంటి పునాదిని బలంగా ఉండేలా చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..