- Telugu News Photo Gallery The transit of the Sun into the star Mrigasira will bring wealth to those of three zodiac signs.
మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే !
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి, నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాటి స్థాన చలనం బట్టి రాశుల పై వాటి ప్రభావం ఉంటుంది. అయితే జూన్8వ తేదీనా మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించనున్నాడు. అయితే దీని ప్రభావం 12 రాశులపై ఉండనుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: May 29, 2025 | 2:22 PM

ప్రస్తుతం సూర్యుడు రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. జూన్ 8వ తేదీన మృగశిర నక్షత్రంలోకి, వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. ఆది వారం ఉదయం 7:26 నిమిషాలకు మృగశిర నక్షత్రంలో సంచరిస్తాడు. తర్వాత జూన్ 15న వృషభ రాశిని వదిలి మిథున రాశిలో సంచరిస్తాడు. అయితే సూర్యుడు మృగశిర నక్షత్రంలో సంచారం చేసినప్పుడు మూడు రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే ?

మృగ శిర నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడం వలన సింహ రాశి వారి ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు కూడా పూర్తవుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. డబ్బును పొదుపు చేసే ఛాన్స్ ఉంది. వ్యాపారం కోసం రూపొందించిన అన్ని వ్యూహాలు లాభాలను ఆర్జిస్తాయి.

తులా రాశి వారికి సూర్యుని సంచారం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.వ్యాపారస్తులు అనేక లాభాలు పొందుతారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. బంధాల బలపడే చాన్స్ ఉంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నసమస్యలు పరిష్కరించబడతాయి.

ధనుస్సు రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందాలు విల్లివిరిస్తాయి. రియలెస్టెట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది.

జీవితంలో మీకు ముఖ్యమైన వారితో గడపడం ఆనందం ఉంటుంది. మీరు ఉద్యోగాలు మార్పులను కోరుకున్నట్లైతే అది నిజం అవుతుంది. మంచి జీతంతో కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.



