వర్షాకాలంలో వేడి వేడిగా.. తెలంగాణ స్పెషల్ సర్వపిండి తింటే ఆ కిక్కే వేరు!
తెలంగాణ స్పెషల్ వంటకం సర్వపిండిని ఇష్టపడని వారు ఎవరుండరు. చాలా మంది ఎంతో ఇష్టంగా సర్వపిండిని తింటుంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో అయితే వేడి వేడిగా..స్పైసీగా ఉండే సర్వపిండి తింటే ఆ కిక్కే వేరుంటుంది. మరి మీకు కూడా సర్వపిండి తినాలనిపిస్తుందా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేటు చేయకుండా తెలంగాణ స్పెషల్ వంటకం సర్వపిండి ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏవో, ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: May 29, 2025 | 2:11 PM

సర్వపిండి తెలంగాణలో చాలా స్పెషల్. సాయంత్రం స్నాక్ లా సర్వపిండి తింటే ఆ ఫీలింగే వేరుంటుంది. ఇక ఈ సర్వపిండిని ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తుంటారు. కొందరు సర్వపిండి అంటే మరికొందరు సర్వప్ప, గిన్నె పిండి, తపాల చక్క ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే కొంత మందికి దీని గురించి సరిగ్గా తెలియదు.

ఇక ఈ వర్షా కాలంలో చాలా మంది స్పైసీగా ఏదైనా తినాలనుకుంటారు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ సర్వపిండి. దీనిని సాయంత్రం లేదా మార్నింగ్ టిఫిన్‌గా తినొచ్చు. కాగా, దీనిని ఎలా తయారు చేస్తారు. సర్వపిండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏదో ఇప్పుడు మనం చూద్దాం.

కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి - 3 కప్పులు, నువ్వులు - 1 టేబుల్‌స్పూన్, కొత్తిమీర తరుగు - 1 స్పూన్, ఉప్పు - రుచికి సరిపడనంతా తీసుకోవాలి.ఆనియన్ ఒకటి, వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు తసుకవాలి.పచ్చిశనగపప్పు రెండు స్పూన్స్, పల్లీలు - పావు కప్పు, జీలకర్ర - ముప్పావు చెంచా, కారం - ఒక టీస్పూన్, రెండు పచ్చి మిర్చీలు.

తయారీ విధానం :ముందుగా పచ్చిశనగపప్పును గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండిని తీసుకొని అందులో కాస్త కారం, నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, పల్లీలు, కరివేపాకు,తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర, కొత్తిమీర తరుగు, నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసి పిండిని చపాతి పిండిలా కలుపుకోవాలి.

తర్వాత ఓ పాన్ తీసుకొని అందులో కొంచెం నూనె పోసి, పాన్‌కు పిండిని అత్తుక్కొనేలా అన్ని వైపులా సమానంగా పెట్టాలి. పల్చగా బౌల్‌కు ఒత్తుకుంటూ రావాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్‌ను గ్యాస్ పై పెట్టి అది రెడ్ కలర్‌లో మంచిగా కాలే వరకు గ్యాస్ పై ఉండనివ్వాలి. అది కాస్త ఎరుపు రంగులోకి వచ్చిందంటే అంతే సర్వపిండి రెడీ. దీనిని వర్షంపడుతున్న సయంలో తింటే ఆ కిక్కే వేరుంటది.



