100 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఏర్పడనున్న 2 రాజయోగాలు.. ఈ 3 రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..

ఏప్రిల్ 2, 2024న మేషరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 9, 2024న బుధుడు మేషరాశిలో తిరోగమనం చేసి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మీనరాశిలో శుక్రుడు, సూర్యుడు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశిలో శుక్రుడు, బుధుడు కలయిక లక్ష్మీ నారాయణ యోగాన్ని సూచిస్తుంది. అదే విధంగా రవి, బుధుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తాయట. ముఖ్యంగా  మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అద్భుత ప్రయోజనాలు తెస్తాయట. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.. 

100 ఏళ్ల తర్వాత మీన రాశిలో ఏర్పడనున్న 2 రాజయోగాలు.. ఈ 3 రాశులకు చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారమే..
Budhaditya Lakshmi Narayan
Follow us
Surya Kala

|

Updated on: Mar 30, 2024 | 9:30 AM

వేద గ్రంధాల ప్రకారం గ్రహాల సంచారం జాతకంపై ప్రభావం చూపిస్తుంది.  ఒక రాశి నుంచి మరొక రాశిలోకి గ్రహాలు ప్రవేశించినప్పుడు యోగాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కొన్ని రాశులకు అదృష్టాన్ని, మరికొన్ని రాశులకు కష్టాలను తీసుకుని వస్తాయి. ఏప్రిల్ 2, 2024న మేషరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. ఏప్రిల్ 9, 2024న బుధుడు మేషరాశిలో తిరోగమనం చేసి మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే మీనరాశిలో శుక్రుడు, సూర్యుడు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రాశిలో శుక్రుడు, బుధుడు కలయిక లక్ష్మీ నారాయణ యోగాన్ని సూచిస్తుంది. అదే విధంగా రవి, బుధుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తాయట. ముఖ్యంగా  మూడు రాశులకు చెందిన వ్యక్తులకు అద్భుత ప్రయోజనాలు తెస్తాయట. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

వృషభ రాశి: మీనరాశిలో ఏర్పడనున్న లక్ష్మీ నారాయణ బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులకు అదృష్టాన్ని తెస్తాయట. ఈ రెండు రాజయోగాలు ఈ రాశిలో లాభస్థానమైన 11వ ఇంట ఏర్పడుతున్నాయి. దీంతో వీరికి అనేక అద్భుత ప్రయోజనాలు కలుగనున్నాయి. పలు ఆదాయ మార్గాల ద్వారా ఆర్ధికంగా లాభాలను అందుకుంటారు.

మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు లక్ష్మీ నారాయణ, బుధాదిత్య రాజ్యయోగాల వల్ల పట్టిందల్లా బంగారమే.. ఈ యోగాలతో ఉద్యోగ స్థులకు, వ్యాపారస్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ తమ కెరీర్‌లో అద్భుత విజయాలు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న యువతి యువకులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: లక్ష్మీ నారాయణ, బుధాదిత్య రెండు రాజయోగాల వలన ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఇవ్వనున్నాయి. ఈ రాజయోగం వలన వీరు కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి. అంతేకాదు ఈ రాశికి చెందిన వ్యక్తులు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో ఎన్నో అనుకూల పరిస్థులతో ఆర్ధికంగా ఊహించని లాభాలను అందుకోనున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వీరు కెరీర్ లో ముందుకు వెళ్లారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు