Weekly Horoscope: ఆ రాశి వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (మార్చి 31 నుంచి ఏప్రిల్ 6, 2024 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఏ పని తలపెట్టినా వేగంగా పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం మెరుగ్గానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి కొందరితో ఏర్పడిన వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: ఆ రాశి వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 31st March 06thapril 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 31, 2024 | 5:01 AM

వార ఫలాలు (మార్చి 31 నుంచి ఏప్రిల్ 6, 2024 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఏ పని తలపెట్టినా వేగంగా పూర్తవుతుంది. వృషభ రాశి వారికి ఆదాయం మెరుగ్గానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశముంది. మిథున రాశి వారికి కొందరితో ఏర్పడిన వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా వేగంగా పూర్తవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అద నపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగిపో తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. చేపట్టిన వ్యవ హారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. భరణి నక్షత్రం వారికి శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఆదాయం మెరుగ్గానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశముంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు కొద్దిగా నిదానంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. అయితే, ఉన్నతాధికారుల ఆదరణ, ప్రోత్సాహం పుష్కలంగా లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన స్థాయిలో లాభాలు అందుతాయి. విదేశీ ప్రయాణానికి ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగు తుంది. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపోతాయి. కృత్తికా నక్షత్రం వారికి మరింతగా కలిసి వస్తుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

బంధుమిత్రులకు బాగా సహాయ సహకారాలు అందజేస్తారు. కొందరితో వివాదాలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటి బాధ్యతల కారణంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయపడగల స్థితిలో ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్ని హిత్యం పెరుగుతుంది. పునర్వసు నక్షత్రం వారికి ఊహించని అదృష్ట యోగం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా సమయం కలిసి వస్తుంది. ఎంత సానుకూల దృక్ఫథంతో వ్యవహరిస్తే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతాధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పుష్యమి నక్షత్రం వారికి మరింత ఉత్తమ ఫలితాలు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజకీయంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని అదృష్టాలు కలిసి రావడంతో పాటు ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. పెండింగు పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకా లంలో చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు శ్రమ మీద మంచి ఫలి తాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. పుబ్బా నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సమయం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఆర్థిక సమ స్యలు బాగా తగ్గుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యో గులకు కూడా కొత్త ఉద్యోగ యోగం ఉంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపా రాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగు తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉత్తరా నక్షత్రం వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజ యాలు సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయానికి లోటు లేనప్పటికీ, ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవ సరం ఉంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు, ప్రయోజనాలు పొందుతారు. రావలసిన డబ్బు, బాకీలు, బకాయిలు సరైన సమయానికి చేతికి అందుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యో గాలు, డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులు అనుకూలంగా, లాభసాటిగా సాగిపోతాయి. ఆస్తి వ్యవ హారం చక్కబడుతుంది. సంతాన యోగానికి సంబంధించిన శుభ వార్త కూడా అందవచ్చు. బంధు మిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా సాగిపోతాయి. స్వాతి నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. ప్రతి వ్యవ హారంలోనూ వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూ లంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ తప్పకుండా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త శ్రమతో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. అనూరాధ నక్షత్రం వారు ఆశిం చిన శుభవార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

బంధువుల నుంచి గానీ, సన్నిహితుల నుంచి కానీ పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ సానుకూల ఫలితాలనిస్తుంది. మంచి పరిచయాలు ఏర్ప డతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది. వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ధన లాభం కలుగు తుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు బాగుంటుంది. పునర్వసు వారికి అదృష్టం పడుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

స్వల్ప అనారోగ్య సమస్యలున్నప్పటికీ పట్టుదలగా పెండింగు పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక సహాయం కోసం కొందరు బంధువులు ఒత్తిడి చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవు తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఉద్యో గంలో అధికారులకు మీ మీద మరింతగా నమ్మకం పెరుగుతుంది. నిరుద్యోగులు, అవివాహితులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ, సహాయాలు పెరుగుతాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి, పిల్లలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆశించిన గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహరాలు అనుకూలిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

బంధువుల నుంచి ఆస్తిపరంగానూ, పెళ్లి ప్రయత్నాల విషయంలోనూ శుభవార్తలు అందుతాయి. వారమంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆస్తి వివాదం ఒకటి దాదాపు పరిష్కారం అవుతుంది. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేసినా, ఏ వ్యవహారాన్ని ప్రారంభించినా తప్పకుండా విజయం లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తగ్గట్టుగా రాబడి కూడా వృద్ధి చెందుతుంది. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవ హారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. శతభిషం నక్షత్రం వారికి మంచి అదృష్టం పడు తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయ త్నాలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు నూటికి నూరు పాళ్లు సఫలం అయి, ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మిత్రుల్లో కొంద రికి ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది అనుకూల సమ యం. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అధికార యోగం పడుతుంది.