AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pithapuram: పిఠాపురం నుంచి నేడు పవన్ ప్రచారానికి శ్రీకారం.. అష్టా దశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ క్షేత్ర మహిమ ఏమిటంటే?

ఏపీలో ఎన్నికల నగారా మ్రోగిన వేళ నేటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. తాను పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గం. తనకు కాపుగా ఉండే ఓటర్ల శక్తి. అంతకుమించి ఇక్కడున్న దైవ శక్తి...దీవిస్తాయనే నమ్మకంతోనే పిఠాపురం నుంచి వారాహి ఎన్నికల యాత్రను చేపట్టనున్నారు.  ఇంతకీ పిఠాపురం విశిష్టత ఏంటి?  ఆ క్షేత్ర విశిష్టత? అక్కడి అమ్మవారి మాహాత్మ్యం ఏంటి? ఈ రోజు తెలుసుకుందాం.. 

Pithapuram: పిఠాపురం నుంచి నేడు పవన్ ప్రచారానికి శ్రీకారం.. అష్టా దశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ క్షేత్ర మహిమ ఏమిటంటే?
Puruhutika Devi Temple
Surya Kala
|

Updated on: Mar 30, 2024 | 9:39 AM

Share

ఎన్నికల నగారా మ్రోగిన వేళ నేటి నుంచి ఏపీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. తను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుంచే ఆయన ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆ నియోజకవర్గంలోనే ప్రచారం చేస్తారు. అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న కాపు ఓటర్లు తనకు అండగా నిలబడడంతో పాటు పిఠాపురంలోని పురుహుతికా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని పవన్‌ నమ్మకం. ఈ విషయాన్ని గతంలో కూడా ఆయన చెప్పారు.

పిఠాపురంలో కొలువైన పురుహుతిక అమ్మవారు.. శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థలి

పవన్‌ కల్యాణ్‌ చెప్పిన అమ్మవారు ఎవరు అంటే పురుహుతికా దేవి. పీఠికాయాం పురుహుతికా అంటుంది అష్టాదశ శక్తి పీఠ స్తోత్రం. అంటే పిఠాపురంలో కొలువైన పురుహుతికా అమ్మవారిని గురించి వర్ణిస్తుంది. అష్టాదశ శక్తి పీఠాల్లో పిఠాపురం ఒకటి. ఆ శక్తిపీఠంలో కొలువైన అమ్మవారే పురుహుతికా దేవి. కాకినాడ జిల్లా పిఠాపురంలో అడుగడుగునా ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తుంది. దేశం నలుమూలల నుంచి ప్రతి రోజు వేలాదిగా భక్తులు పిఠాపురం వస్తుంటారు. ఇక్కడున్న ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. ఇందులో ముఖ్యమైన దేవాలయం  అష్టాదశ శక్తిపీఠాలలో పదో శక్తి పీఠమైన పురుహుతికా అమ్మవారు. త్రిగయలలో ఒకటైన పాద గయా క్షేత్రం ఇది. అలాగే దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పుణ్యస్థలం అని చెబుతారు. ఇక పంచ మాధవ ఆలయాలలో ఒకటైన కుంతీమాధవ ఆలయం ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రంగా పిఠాపురం క్షేత్రం విరాజిల్లుతోంది.

పాద గయగా పేరు.. పితృ దేవతలకు కర్మకాండలు

కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో కత్తిపూడి టూ పామూరు హైవే రోడ్డుకు అనుకుని ఉంటుంది పిఠాపురం. పాదగయ ఆలయ సముదాయాలలో పురుహుతిక అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడి పాద గయ కోనేరులో పితృదేవతలకు కర్మ కాండలు చేస్తే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని భక్తులు నమ్మకం. గతంలో వారాహి యాత్రలో పురుహుతికా అమ్మవారి ఆశీస్సులు, శ్రీపాద శ్రీ వల్లభుడి దీవెనలు ఉంటే…తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానన్న పవన్‌…ఆ మాట ప్రకారం ఇక్కడ్నించే ఎన్నికల బరిలో దిగారు.

ఇవి కూడా చదవండి

10వ శక్తిపీఠం

ఈ పాదగయా క్షేత్రంలో కోరిన కోరికలను అమ్మవారు నెరవేరుస్తారని భక్తులు నమ్ముతారు. దక్షయజ్ఞం జరిగిన తర్వాత తనువు చాలించిన తన భార్య సతీదేవి శరీరాన్ని భుజాన్ని వేసుకొని శివుడు ప్రళయాన్ని సృష్టించిన తరుణంలో విష్ణుమూర్తి శివున్ని శాంతింపజేసి… సతీదేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో 18 భాగాలుగా ఖండిస్తాడు. ఆ 18 ఖండాలు 18 శక్తి పీఠాలుగా విరాజల్లుతున్నాయి. అందులో పీఠభాగము పిఠాపురంలో పడడంతో 10వ శక్తిపీఠమైన పురుహతికగా అమ్మవారు ఇక్కడ పూజలందుకుంటున్నారని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

మరో వైపు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంతో జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కదం తొక్కుతోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ కూడా రేపుతోంది. ఇక వారాహి వాహనానికి పురుహుతికా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారని పిఠాపురం జనసేన నాయకులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..