AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budh Gochar: వృశ్చిక రాశిలో బుధుడు.. ఇక ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!

గత అక్టోబర్ 31వ తేదీన వృశ్చిక రాశిలో ప్రవేశించిన బుధుడు ఈ రాశిలో జనవరి 4 వరకూ కొనసాగడం ఒక విశేషం కాగా, వక్రగతిలో ఉన్న శని, గురు గ్రహాలు ఈ బుధుడిని పూర్ణ దృష్టితో వీక్షించడం మరో విశేషం. సాధారణంగా బుధుడు ఏ రాశిలోనూ మూడు వారాలకు మించి సంచారం చేసే అవకాశం ఉండదు.

Budh Gochar: వృశ్చిక రాశిలో బుధుడు.. ఇక ఆ రాశుల వారికి కొత్త జీవితం పక్కా..!
Budh Gochar in Vrischika Rashi
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 07, 2024 | 6:38 PM

Share

గత అక్టోబర్ 31వ తేదీన వృశ్చిక రాశిలో ప్రవేశించిన బుధుడు ఈ రాశిలో జనవరి 4 వరకూ కొనసాగడం ఒక విశేషం కాగా, వక్రగతిలో ఉన్న శని, గురు గ్రహాలు ఈ బుధుడిని పూర్ణ దృష్టితో వీక్షించడం మరో విశేషం. సాధారణంగా బుధుడు ఏ రాశిలోనూ మూడు వారాలకు మించి సంచారం చేసే అవకాశం ఉండదు. అందుకు భిన్నంగా ఈసారి ఏకంగా 64 రోజులు వృశ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ దీర్ఘకాలిక సంచారంతో పాటు అత్యంత ప్రధాన గ్రహాలైన శని, గురువులు బుధుడిని వీక్షించడం వల్ల బుధుడు కొన్ని రాశులవారి జీవితాల్లో కొత్తదనాన్ని నింపే అవకాశం ఉంటుంది. ఆదాయపరంగా, ఉద్యోగపరంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఏదో విధమైన కొత్తదనాన్ని నింపడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి జీవితం సమూలంగా మారిపోయే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో బుధుడు సంచారం చేయడం, దాన్ని గురు, శనులు వీక్షించడం వల్ల జనవరి 4వ తేదీ లోపు వీరికి పెళ్లి జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పెళ్లితో వీరి జీవిత గమ్యం మారిపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. బదిలీ లేదా స్థాన చలనానికి అవకాశం ఉంది. కొత్త ప్రదేశంలో కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు ఎక్కువ కాలం తిష్ఠ వేయడం, దాన్ని గురు, శనులు వీక్షిం చడం వల్ల కొత్త వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి, గృహ సంబంధమైన విషయాల్లో ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. సామాజికంగా కొత్తవారితో పరిచయాలు ఏర్పడడంతో పాటు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనుకోకుండా అనేక విధాలుగా సంపద బాగా వృద్ధి చెందుతుంది.
  3. సింహం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఉన్న బుధుడిని శని, గురులు వీక్షిస్తున్నందువల్ల బదిలీలకు, స్థాన చలనాలకు బాగా అవకాశం ఉంది. కొత్తగా గృహ యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారడం, హోదాలు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనుకోకుండా భూలాభం కలుగు తుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగు లకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
  4. వృశ్చికం: ఈ రాశిలో ఉన్న బుధుడిని శని, గురులు వీక్షిస్తున్నందువల్ల మరింత మంచి ఉద్యోగంలోకి మార డానికి, నిరుద్యోగులు కొత్త ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమై దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తితో సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. నూతన గృహ ప్రవేశం చేసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు బదిలీ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న బుధుడిని గురు, శనులు వీక్షించడం వల్ల సరికొత్త ఆదాయావ కాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు అమలు చేస్తారు. ఉద్యోగంలో హోదాలు, బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఉద్యోగంతో పాటు కోరుకున్న పెళ్లి సంబంధం కుదు రుతుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా కొత్త జీవితం ఏర్పడుతుంది. సామాజికంగా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఊహించని పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.
  7. కుంభం: ఈ రాశికి ఉద్యోగ స్థానంలో ఉన్న బుధుడి మీద శని, గురుల దృష్టి పడినందువల్ల ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు స్థాన చలనానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. విలాసవంతమైన జీవితం ఏర్పడుతుంది.