Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 8, 2024): మేష రాశి వారు కొత్త లక్ష్యాలను చేపట్టవలసి వస్తుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 08th November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 08, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 8, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో కొన్ని అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో కొన్ని అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త లక్ష్యాలను చేపట్టవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా కార్యకలాపాలు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. స్తోమతకు మించి కొందరు స్నేహితులకు సహాయపడతారు. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. నిరుద్యోగులు ఇర దేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. పిల్లలు పురోగతి సాధి స్తారు. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో కొన్ని ఊహించని శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహా రాలు సంతృప్తికరంగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కొందరు బంధువులు సహాయపడతారు. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. కుటుంబంలో శుభ కార్యం తలపెడతారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి శుభ వార్తలు వినే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల కనిపిస్తుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లోనూ, ఇచ్చిపుచ్చుకోవడాల్లోనూ అప్రమ త్తంగా ఉండాలి. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. కొందరు దగ్గర బంధువులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఇరుగు పొరుగు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లభ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పురో గమిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆదాయపరంగా అనుకూల వాతావరణం నెల కొని ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువుల నుంచి ఊహించని శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో పని ఒత్తిడి, అధికారుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి జీవితలో కార్యకలాపాలు బాగా పెరిగి, విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. రావాల్సిన డబ్బు వసూలవుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం హుషారుగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారే అవ కాశం కూడా ఉంది. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలకు సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యో గానికి సంబంధించి మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. ప్రయాణాల వల్ల లాభపడతారు. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులకు బాగా నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. కొద్దిగా అనా రోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా పెరిగే సూచనలు న్నాయి. దైవ కార్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్త వింటారు. మిత్రులకు సహాయంగా ఉంటారు. ఇతరుల వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబం మీద భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బంధువుల తోడ్పాటుతో పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు సమయం అను కూలంగా ఉంది. మంచి ఆఫర్లు అందుతాయి. కొందరు మిత్రుల వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.

కుంభం (ధనిష‌్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు, ఆటంకాలను అధిగమిస్తారు. రాబడికి లోటుండకపో వచ్చు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా పూర్త వుతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆశించిన పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ధనయోగాలు పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో అనుకోని చికాకులుంటాయి.