Budh Gochar 2025: వృషభ రాశిలోకి బుధుడు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారం..!
Mercury Transit 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం వృషభ రాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో విజయాలు, ఆర్థిక లాభాలు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ప్రతిభ, తెలివితేటలు, పట్టుదల పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాలు పొందే అవకాశం కూడా ఉంది.

Mercury Transit in Taurus
Mercury transit in Taurus: జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ బుధ గ్రహం అనుకూలంగా ఉన్న పక్షంలో సాధించ లేనిది ఏదీ ఉండదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వివేకం, తెలివితేటలు, ప్రతిభ, దూరదృష్టి, విషయ పరిజ్ఞానం, ప్లానింగ్, పట్టుదల వంటి అంశాలకు కారకుడైన బుధ గ్రహం ఈ నెల 24 నుంచి జూన్ 6 వరకు తనకు మిత్ర క్షేత్రమైన వృషభరాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ గుణాలన్నీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా, మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకర రాశుల వారికి విజయాలు, సాఫల్యాలు బాగా అనుభవానికి వస్తాయి.
- మేషం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారిలోని నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోయే తత్వం, దూర దృష్టి వంటివి మరింతగా వెలుగులోకి వస్తాయి. తమ తెలివి తేటలు, ప్రతిభ, సమర్థతలతో ఈ రాశివారు ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు. వీరి సారథ్యంలో వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తమ పనితీరుతో అధికారులు లేదా యజమానులను ఆకట్టుకుంటారు. గట్టి పట్టుదలతో, సరికొత్త వ్యూహాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు.
- వృషభం: ధన, పంచమాధిపతిగా ఈ రాశికి అత్యంత శుభుడైన బుధుడు పట్టుదలకు, ప్రణాళికలకు మారుపేరైన ఈ రాశిలో సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ పట్టువదలని విక్రమార్కుల్లా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో తమ సత్తాను నిరూపించుకుని పదోన్నతులు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. వీరు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానమైన వృషభ రాశిలో బుధుడి సంచారం వల్ల మనసులోని కోరికలు, ఆశలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే ఈ రాశివారు అతి జాగ్రత్తగా ప్లాన్ చేసి షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా అత్యధికంగా సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లకు మించిన ప్రతిభను కనబరుస్తారు. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కలను నెరవేర్చుకుంటారు.
- సింహం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఒక సంస్థలో సర్వాధికారి కావాలన్న ఈ రాశివారి కోరిక, ప్రయత్నం తప్పకుండా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వీరు తమ సత్తాను అనేక విధాలుగా నిరూపించుకుంటారు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెట్టి, లాభాల బాటను పట్టి స్తారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి.
- కన్య: రాశినాథుడు బుధుడు భాగ్య స్థానంలో సంచారం చేయడం ఒక అదృష్ట యోగం. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలుగుతాయి. అనేక పర్యాయాలు ధన యోగాలు పడతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. దూర దృష్టి, ప్రణాళికలకు మారుపేరైన ఈ రాశివారు షేర్లు తదితర అద నపు ఆదాయ ప్రయత్నాల్లో ఘన విజయం సాధిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధ సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ప్రతిభను, నైపుణ్యాలను పెంచుకుని వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. ఈ రాశివారిలోని పట్టుదల, సహనం, వ్యూహం వంటి లక్షణాల వల్ల అనేక విధాలుగా విజయాలు సాధించడం జరుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.



