Guru Transit 2025: గురు బలం.. ఆ రాశుల వారి సంతానానికి అన్ని శుభ యోగాలే..!
Jupiter Transit 2025: సంతానానికి సంబంధించిన జ్యోతిష్య ఫలాలు తెలుసుకోవాలంటే గురు సంచారం చాలా కీలకం. సంతాన ప్రాప్తి, వారి చదువులు, ఉద్యోగం, పెళ్లిళ్లు తదితరాలు అన్నిటినీ గురు గ్రహ స్థితిగతుల సంచారం ఆధారంగానే లెక్కిస్తారు. ఈ నెల 25న గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశి సంచారం ప్రారంభిస్తుంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారి సంతానానికి శుభ యోగాలు పట్టనున్నాయి.

Guru Transit 2025
Jupiter Transit in Gemini: గురువు సంతాన కారకుడు. పిల్లలకు సంబంధించిన విషయాలన్నీ గురువు ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. సంతాన ప్రాప్తి, సంతాన వృద్ధి, చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, ఆదాయం, భవిష్యత్తు వంటి అంశాలన్నీ గురువు స్థితిగతుల మీదా, సంచారం మీదా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్న గురువు ఈ నెల 25న మిథున రాశిలో ప్రవేశించడంతో పిల్లలకు సంబంధించిన విషయాల్లో మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమవుతుంది. గురువు మిథున రాశిలో 2026 జూన్ వరకు కొనసాగుతాడు. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులకు పిల్లల విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- వృషభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో గురువు సంచారం వల్ల సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలకు సంబంధించి ఎక్కువగా శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం కలుగుతుంది. చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత పదవులను అందుకుంటారు. ప్రతిభా పాట వాలు బాగా వెలుగులోకి వస్తాయి. సరికొత్త నైపుణ్యాలను అలవరచుకుంటారు. కొద్ది ప్రయత్నంతో వారికి ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుంది.
- మిథునం: ఈ రాశిలో గురువు సంచారం వల్ల సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లలకు మార్గదర్శకత్వం చేయడం, వారిని తీర్చిదిద్దడం జరుగుతుంది. చదువుల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. చదువుల్లో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. అంచనాలకు మించి వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. దగ్గర బంధువులతో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి సకాలంలో మంచి ఉద్యోగం లభిస్తుంది.
- సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు సంచారం వల్ల పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. చదువుల్లోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా అంచనాలకు మించి పురోగతి చెందడం జరుగుతుంది. పిల్లల విషయంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలకు సంబంధించి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు స్థిరపడతారు.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. పిల్లలకు తల్లితండ్రుల మార్గదర్శకత్వం లభిస్తుంది. పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. బాగా వృద్ధి లోకి రావడం, ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడం జరుగుతుంది. చదువుల పట్ల, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం పట్ల శ్రద్ధాసక్తులు బాగా వృద్ధి చెందుతాయి. సాధారణంగా పిల్లలకు విదేశాల్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంట్లో ఒకటి రెండు శుభకార్యాలు జరుగుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల సంతాన లేమి సమస్య నుంచి బయటపడడం జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. అనారోగ్యాలతో ఉన్నవారు బాగా కోలుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల విషయంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతానంలో ఒకరికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం పడుతుంది. చదువుల్లో రికార్డులు సృష్టించడం జరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో, అంటే పుత్ర స్థానంలో గురు సంచారం పిల్లలకు యోగదాయకంగా ఉంటుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. చదువులు, పోటీ పరీక్షల్లో ఘన విజయాలు సాధిస్తారు. పిల్లలకు సంబంధించి ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. చదువులు, వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లలు స్థిరపడే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.



