Lord Shani Dev: శని, బుధుల యుతితో శుభ యోగాలు.. ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..!
శనీశ్వరుడి చెడు ప్రభావాన్ని తగ్గించే శక్తి, శనిని శుభ గ్రహంగా మార్చే శక్తి శుక్ర, బుధులకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం కుంభ రాశిలో శనితో బుధుడు కలిసినందువల్ల శని అయిదు రాశుల వారికి శుభుడుగా మారడం జరిగింది.ముఖ్యంగా జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే అవ కాశం ఉంటుంది. ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఎటువంటి సమస్యలున్నా వాటి నుంచి బయటికి తీసుకు వచ్చే అవకాశముంటుంది.
శనీశ్వరుడి చెడు ప్రభావాన్ని తగ్గించే శక్తి, శనిని శుభ గ్రహంగా మార్చే శక్తి శుక్ర, బుధులకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం కుంభ రాశిలో శనితో బుధుడు కలిసినందువల్ల శని అయిదు రాశుల వారికి శుభుడుగా మారడం జరిగింది. అవిః మేషం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మీన రాశులు. శని, బుధులు ఈ రాశుల వారికి దుస్థానాల్లో కలిసినప్పటికీ శుభ యోగాలు కలగ జేయడం, శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా జీవితంలో స్థిరత్వాన్ని ఇచ్చే అవ కాశం ఉంటుంది. ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఎటువంటి సమస్యలున్నా వాటి నుంచి బయటికి తీసుకు వచ్చే అవకాశముంటుంది.
- మేషం: జ్యోతిష శాస్త్రం ప్రకారం 11వ స్థానం పాప స్థానమే అయినప్పటికీ, అక్కడ శని, బుధులు కలవడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా మారడంతో ప్రశాంతంగా కాలం గడపడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన అభి వృద్ధి ఉంటుంది. బాగా ఒత్తిడినిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆదాయవృద్ధి ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశికి అష్టమ రాశిలో శని, బుధులు కలిసినందువల్ల అష్టమ శని ప్రభావం బాగా తగ్గి, ఈ రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలే అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, ఒత్తిళ్లు, వేధింపులు మటుమాయం అవుతాయి. ఆదాయపరమైన స్థిరత్వం లభిస్తుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుని, పొదుపు పాటించడం ప్రారంభిస్తారు. ఈ రాశి వారి సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి.
- కన్య: ఈ రాశినాథుడు బుధుడు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల చెడు ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ శనితో కలిసినందువల్ల కెమిస్ట్రీ మారిపోతుంది. ఈ రెండు గ్రహాలు ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తాయి. అనుకోని విధంగా, అనేక విధాలుగా ఆదా యం పెరగడంతో ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. శత్రు వులు, పోటీదార్లు తప్పుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారానికి మార్గం సుగమం అవుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో శని, బుధులు కలవడం రాజయోగానికి అవకాశం ఇస్తోంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమ స్యలు కూడా తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సర్వత్రా గౌరవమర్యాదలు, పలుకుబడి పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.
- మీనం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో శని, బుధులు కలిసి ఉండడం అనేది కుటుంబంలోనే కాక, వ్యక్తిగతంగా కూడా సుఖ సంతోషాలకు దారితీస్తుంది. బుధుడితో కలవడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం కూడా బాగా తగ్గిపోతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఎక్కడైనా బతకగలననే ధీమా ఏర్పడుతుంది. వైద్య ఖర్చులతో సహా అన్ని రకాల ఖర్చులు తగ్గించు కోవడంతో పాటు, పొదుపు పాటించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది.