Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips on Diamond: వజ్రం ధరించడానికి కొన్ని నియమాలు.. కొన్ని రాశులు వజ్రాన్ని ధరిస్తే.. అష్టకష్టాలు తప్పవట..

మీరు ఇప్పటికే ఇతర రత్నాలను ధరిస్తున్నట్లయితే.. అకస్మాత్తుగా వజ్రాన్ని ధరించడం ప్రారంభించవద్దు. ఎందుకంటే రత్నాలతో పాటు.. వజ్రాన్ని ధరించడం మంచికి బదులుగా చెడు ఫలితాలను ఇస్తుంది. జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే వజ్రం ధరించే ముందు..  ఎవరైనా సరే అప్పటి వరకూ రత్నాన్ని ధరించలేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. 

Astro Tips on Diamond: వజ్రం ధరించడానికి కొన్ని నియమాలు.. కొన్ని రాశులు వజ్రాన్ని ధరిస్తే.. అష్టకష్టాలు తప్పవట..
Astro Tips For Diamond
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2023 | 8:32 AM

వజ్రం నవరత్నాల్లో ఒకటి. వజ్రం ధరించడం ఇష్టాన్ని లేదా తమ సంపదను ప్రదర్శించడానికి మాత్రమే ధరించరు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో వజ్రం శుక్ర గ్రహానికి సంబంధించినది. శుక్రుడు అందం, వైవాహిక జీవిత ఆనందాన్ని సూచిస్తాడు. వజ్రం ఆనందం, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆభరణాలు, బట్టలు, బ్యూటీ ప్రోడక్ట్స్ వ్యాపారం చేసే వారికి వజ్రం ధరించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే మీరు ఇప్పటికే ఇతర రత్నాలను ధరిస్తున్నట్లయితే.. అకస్మాత్తుగా వజ్రాన్ని ధరించడం ప్రారంభించవద్దు. ఎందుకంటే రత్నాలతో పాటు.. వజ్రాన్ని ధరించడం మంచికి బదులుగా చెడు ఫలితాలను ఇస్తుంది. జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే వజ్రం ధరించే ముందు..  ఎవరైనా సరే అప్పటి వరకూ రత్నాన్ని ధరించలేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

ఏ రత్నాలతో వజ్రాన్ని ధరించకూడదంటే?  మీరు ఇప్పటికే ముత్యం ధరించి ఉంటే… పొరపాటున కూడా వజ్రం ధరించవద్దు. లేకపోతే మిమ్మల్ని టెన్షన్ చుట్టుముడుతుంది. మానసిక సమస్యలు వస్తాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పగడం, కెంపు ధరించిన వారు వజ్రాన్ని వాటితో పాటు ధరించకూడదు. ఇలా చేయడం వలన నష్టాన్ని భరించాల్సి రావచ్చు.

ఇవి కూడా చదవండి

వజ్రం ధరించిన వ్యక్తి పుష్యరాగం కూడా ధరించకూడదు. దీంతో ఆర్థికంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏ వ్యక్తులు వజ్రాన్ని అస్సలు ధరించకూడదంటే?

మిథునరాశి వారు వజ్రాన్ని ధరించకూడదు. ఈ రాశికి చెందిన నక్షత్రం మృగశిర.  కనుక ఈ రాశివారికి వజ్రం ప్రయోజనకరం కాదు.

జాతకంలో కుజుడు, గురు, శుక్ర గ్రహాలు ఉన్నవారు వజ్రం ధరిస్తే వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

ఎవరి జాతకంలోనైనా శుక్రుడు తృతీయ, పంచమ , అష్టమ స్థానాలలో ఉంటే వారు కూడా వజ్రం ధరించడం  శ్రేయస్కరం కాదు..

వజ్రం ధరించడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు.. వజ్రాన్ని ధరించే ముందు..  జీవ ప్రతిష్ట చేయడం చాలా ముఖ్యం. దీనికి శుక్రవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యోదయం తర్వాత 11 గంటల లోపు వజ్రాన్ని ధరించాలి.

వజ్రాన్ని ధరించే ముందు జ్యోతిష్యుని సలహా తీసుకోండి, మీ సొంత నిర్ణయం లేదా ఇష్టానుసారం ధరించవద్దు. ఎన్ని క్యారెట్ల వజ్రం ధరించాలి.. ఏ రకమైన వజ్రం ధరిస్తే.. మీకు శుభం కలుగుతుందని అప్పుడే తెలుస్తుంది.

రక్తసంబంధిత వ్యాధి లేదా షుగర్‌తో బాధపడేవారు వజ్రాన్ని ధరించకూడదు. వజ్రం ధరించే వయస్సు 21 నుండి 50 సంవత్సరాలు.

కుడిచేతి మధ్య వేలిలో వజ్రాన్ని ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఎల్లప్పుడూ శుక్ల పక్షంలో ధరించాలి.

మీ వైవాహిక జీవితంలో ఇప్పటికే ఏదైనా సమస్య ఉంటే, అకస్మాత్తుగా వజ్రం ధరించడం వలన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).