గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించేలా చర్యలు తీసుకోండి.. జస్టిస్ ఎన్.వి.రమణను కోరిన యుగ తులసి చైర్మన్
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎ న్.వి.రమణ కు యుగ తులసి చైర్మన్ కె. శివ కుమార్ వినతి పత్రం సమర్పించారు.
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు యుగ తులసి చైర్మన్ కె. శివ కుమార్ వినతి పత్రం సమర్పించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు కొలిశెట్టి శివ కుమార్ వినతి పత్రం అందజేశారు. అనేక చట్టాలు ఉన్న గోమాతలు కబేలాలకు తరలిపోతున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కబేలాలు మూసివేయ్యాలన్నారు. కేంద్రం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు. గో హింస ఆగాలని, గో హత్యలు ఆపాలని విజ్ఞప్తి చేశారు. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానములు ఇప్పటికే తీర్మానం (నెం.426, తేదీ:27.02.2021) చేసిన విషయాన్ని కె శివ కుమార్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దృష్టికి తీసుకువచ్చారు.
అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జస్టిస్ ఎన్.వి. రమణ. ఈ తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమలేశుడి దర్శన భాగ్యాన్ని కలిగించారు.