Andhra Pradesh: వైసీపీ యూటర్న్.. ఆంధ్రా ఊటీ నుంచి పోటీ చేసే ఆ కొండ దొర ఎవరో తెలుసా..?
అరకు అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎత్తైన తూర్పు కనుమల మధ్య దట్టమైన అటవీ శ్రేణుల మధ్య లోయలో ఉండే అరకు.. అంటే ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఇష్టం.. ప్రకృతి సహజ సౌందర్యానికి అంతులేని ఆనందానికి కొలువైన అరకులో రాజకీయం కూడా ఇటీవల కాలంలో చాలా ఆసక్తికరంగా మారింది.

అరకు అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎత్తైన తూర్పు కనుమల మధ్య దట్టమైన అటవీ శ్రేణుల మధ్య లోయలో ఉండే అరకు.. అంటే ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఇష్టం.. ప్రకృతి సహజ సౌందర్యానికి అంతులేని ఆనందానికి కొలువైన అరకులో రాజకీయం కూడా ఇటీవల కాలంలో చాలా ఆసక్తికరంగా మారింది. అరకులో సాధారణంగా కొండ దొర సామాజిక వర్గందే జనాభాపరంగా అగ్రస్థానం. అయితే అక్కడ ఆ సామాజిక వర్గానికి బదులు వాల్మీకి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత లభిస్తూ వచ్చేది. దీంతో ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని దక్కించుకోవాలన్న వ్యూహంతో కొండదొర సామాజిక వర్గం ముందడుగు వేసింది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా వారిని ఫాలో అవుతున్నాయి. ఆ క్రమంలోనే అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి ఫల్గుణ అనే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని మార్చి కొత్తగా కొండ దొరు సామాజిక వర్గానికి చెందిన నేతను ఎమ్మెల్యేగా రంగంలోకి దించాలని అన్ని పార్టీలూ నిర్ణయించాయి. దానిలో భాగంగానే అరకు వైఎస్సార్సీపీ సమన్వయకర్తను మార్చాలన్న ఆలోచనకు వచ్చింది అధికార పార్టీ వైసీపీ..
క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం నివేదిక ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
ప్రస్తుతం సమన్వయ కర్తగా ఉన్న గొడ్డేటి మాధవి స్థానంలో హుకుంపేట జెడ్పీటీసీ రేగు మత్స్యలింగంను అరకు సమన్వయకర్తగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో కొండదొర సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది వైఎస్సార్సీపీ.. అందులో భాగంగా ఆ సామాజిక వర్గానికి చెందిన అరకు ఎంపి గొడ్డేటి మాధవిని సమన్వయకర్తగా నియమించింది. అయితే, మాధవి స్థానికురాలు కాదంటూ అరకులో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో పార్టీ ఇంచార్జ్ సుబ్బారెడ్డి స్వయంగా అరకు వెళ్లి క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి పార్టీ అధిష్టానానికి ఒక నివేదిక అందించారు.
ఆ దొరనే ఎమ్మెల్యే అభ్యర్ధి..?
తాజాగా స్థానికుడు, కొండ దొర సామాజిక వర్గానికి చెందిన మత్స్య లింగంను తాడేపల్లి పిలిపించిన వైఎస్ జగన్ .. ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. వైఎస్సార్సీపీ నూతన సమన్వయ కర్తగా మత్స్య లింగం పేరు దాదాపు ఖరారు చేసింది. ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. కానీ స్వయంగా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మత్స్య లింగం ని పిలిచి అభినందించి ఎన్నికల్లో పోటీ చేసెందుకు అవసరమైన ఎక్సర్‌సైజ్ చేయాలని చెప్పి పంపడంతో దాదాపుగా ఖరారు అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పుడు అరకు పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
