Voting: ఓటింగ్ శాతం పెరిగేలా ఈసీ కీలక నిర్ణయం.. దివ్యాంగులు ఇంటి దగ్గరే ఓటు వేసే ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సంక్షిప్త ఓటర్ జాబితా-2024 ను జనవరి 22న విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా రాష్ట్రంలో పర్యటించి గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, ఓటింగ్ సరళి తోపాటు ఓటింగ్ నమోదుపై కారణాలు అడిగి తెలుసుకున్నారు.

Voting: ఓటింగ్ శాతం పెరిగేలా ఈసీ కీలక నిర్ణయం.. దివ్యాంగులు ఇంటి దగ్గరే ఓటు వేసే ఛాన్స్..!
Disabled People Voting
Follow us
pullarao.mandapaka

| Edited By: Balaraju Goud

Updated on: Jan 31, 2024 | 11:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సంక్షిప్త ఓటర్ జాబితా-2024 ను జనవరి 22న విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా రాష్ట్రంలో పర్యటించి గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు, ఓటింగ్ సరళి తోపాటు ఓటింగ్ నమోదుపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సారి 18 ఏళ్ళు నిండిన యువత ఎక్కువగా ఉన్నప్పటికీ ఓటు నమోదుకు చాలా మంది అఇష్టత వ్యక్తం చేసినట్లు ఈసీ అధికారులు తెలిపారు. దీంతో వీరికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

యువతలో ఓటింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. కాలేజీల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి ఓటు నమోదు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఏయే ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా నమోదు అయిందో, అలాంటి చోట్ల ఓటింగ్ శాతం పెంపునకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక వయసు పరంగా ఉన్న ఓటర్ల సంఖ్య, నమోడవుతున్న పోలింగ్ శాతంపైనా దృష్టి పెట్టారు. 80 ఏళ్ళు పైబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లతో ఇం టివద్దనే ఓటు హక్కు వినియగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు..తాజాగా అందరికీ అందుబాటులో ఎన్నికలు కోసం ప్రత్యేకంగా ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్, అమరావతి సచివాలయంలో సమావేశమై దివ్యాoగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతిలోని సచివాలయంలో అందరికీ అందుబాటులో ఎన్నికలపై ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఇంటివద్ద నుంచి ఓటు వేయాలనుకున్న దివ్యాoగులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఆయా ఓటర్లు సంబంధిత బీఎల్ ఓ ల ద్వారా రిటర్నింగ్ అధికారికి ఫామ్ – 12D సమర్పించాలని ముకేశ్ కుమార్ మీనా సూచించారు.పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగుల కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.. రెడ్ క్రాస్, NSS, NCC వాలంటీర్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మీనా చెప్పారు. కమిటీలో ఉన్న పలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పలు అంశాలను సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా,నియోజకవర్గ స్థాయిలో నియమించే అందరికి అందుబాటులో ఎన్నికలు కమిటీల్లో దివ్యాంగుల సంఘాలకు చోటు కల్పిస్తామని మీనా తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…