YSRCP Bus Yatra: ‘దేశానికే ఆదర్శంగా జగన్ సంక్షేమ పాలన’.. వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర షురూ..
YSRCP Bus Yatra: జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన లబ్ధిని తెలియజేస్తూ ముందుకు సాగుతోంది వైసీపీ సామాజిక సాధికార యాత్ర. తొలి విడత ముగిశాక.. నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని.. రెండో విడత యాత్ర ఇవాల్టి నుంచి మొదలైంది. ఈ నెల 30వ తేదీ వరకు 39 సెగ్మెంట్లలో సాగనుంది వైసీపీ బస్సు యాత్ర. వైసీపీ కీలక నేతలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ఆయా వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు యాత్రలో పాల్గొంటున్నారు.

YSRCP Bus Yatra: జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరిగిన లబ్ధిని తెలియజేస్తూ ముందుకు సాగుతోంది వైసీపీ సామాజిక సాధికార యాత్ర. తొలి విడత ముగిశాక.. నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని.. రెండో విడత యాత్ర ఇవాల్టి నుంచి మొదలైంది. ఈ నెల 30వ తేదీ వరకు 39 సెగ్మెంట్లలో సాగనుంది వైసీపీ బస్సు యాత్ర. వైసీపీ కీలక నేతలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ఆయా వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు యాత్రలో పాల్గొంటున్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, కోస్తాంధ్ర నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు, రాయలసీమ నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర షురూ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. సీఎం జగన్ సంక్షేమ పాలన ఆదర్శంగా నిలుస్తుందంటూ పేర్కొన్నారు. చంద్రబాబు దళితులను అవమానించారని.. అలాంటి వారికి సీఎం జగన్ కీలక పదవులిచ్చారంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలు ఇవాళ తలెత్తుకుని తిరుగుతున్నారంటూ పేర్కొన్నారు.
అక్టోబర్ 26 వతేదీన ప్రారంభమైన సామాజిక సాధికార యాత్ర.. మొదటి దశలో 23 జిల్లాల్లోని 35 నియోజకవర్గాల్లో పూర్తయింది. ఆయా జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సామాజిక సాధికారయాత్రను విజయవంతం చేసినట్లు పార్టీ ప్రకటించుకుంది. ఇప్పుడు మలి విడతలో వ్యాపార, ఉద్యోగ వర్గాల్ని కూడా కలుపుకుని యాత్రను సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు వైసీపీ నేతలు. గత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి తేడా చూడండి అని ప్రజలకు విన్నవించుకునే ప్రయత్నం కూడా బస్సు యాత్ర ద్వారా జరుగుతోంది.
విజయవంతంగా వైసీపీ సామాజిక సాధికార యాత్ర#SamajikaSadhikaraYatra #CMYSJagan #YSRCP pic.twitter.com/0C5jGnzayM
— Jagananna Ki Thoduga (@JThoduga) November 15, 2023
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 4.69 లక్షల కోట్ల రూపాయల సొమ్మును పేదల ఖాతాల్లో వేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకు వెళుతున్నారు వైసీపీ నేతలు. GSDP వృద్ధి రేటులో నెంబర్-1గా నిలిచామని, రాష్ర్ట ప్రజల తలసరి ఆదాయ వృద్ధిలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గా 17వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరిందని గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు అధికార పార్టీ నేతలు.
మొత్తం 60 రోజుల్లో, డిసెంబర్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ సామాజిక సాధికార బస్సు యాత్రను పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..