Watch Video: బీజేపీ - జనసేన మధ్య బంధంపై జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Watch Video: బీజేపీ – జనసేన మధ్య బంధంపై జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Janardhan Veluru

|

Updated on: Nov 15, 2023 | 3:42 PM

ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీలు క్లారిటీ ఇచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని.. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని పలు సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీతో పొత్తు  కోసం టీడీపీ కూడా ప్రయత్నాలు చేసినా.. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించిన చర్చల ప్రక్రియను కూడా ఆ పార్టీలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో జనసేనతో బీజేపీ బంధంపై జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

బీజేపీ-జనసేన పార్టీల మధ్య బంధంపై బీజేపీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిలో ఇప్పటికీ జనసేన పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతో జనసేన పొత్తు ఉందని చెప్పారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నారని చెప్పారు.  హైదరాబాద్ సభలోనూ ఈ విషయాన్ని పవన్ చెప్పారని అన్నారు. బీజేపీ-జనసేన బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని జీవీఎల్ ధీమా వ్యక్తంచేశారు.

ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీలు క్లారిటీ ఇచ్చేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని.. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీతో పొత్తు  కోసం టీడీపీ అధిష్టానం కూడా ప్రయత్నాలు చేసినా.. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే హైదరాబాద్‌లో బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్ కల్యాణ్ వేదికను పంచుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించిన చర్చల ప్రక్రియను కూడా ఆ పార్టీల నేతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేనతో బీజేపీ బంధంపై ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

Published on: Nov 15, 2023 03:37 PM