Watch Video: రేవంత్ రెడ్డి వాహనంలో పోలీసుల తనిఖీలు..

Watch Video: రేవంత్ రెడ్డి వాహనంలో పోలీసుల తనిఖీలు..

Janardhan Veluru

|

Updated on: Nov 15, 2023 | 2:48 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.571 కోట్లు విలువ చేసే నగదు, బంగారం, ఇతరత్రాలు సీజ్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.571 కోట్లు విలువ చేసే నగదు, బంగారం, ఇతరత్రాలు సీజ్ చేశారు. రాజకీయ ప్రముఖుల వాహనాల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కారులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు రోడ్డు మార్గంలో వెళ్తుండగా చెక్ పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. రేవంత్ రెడ్డి తనిఖీలకు పూర్తిగా సహకరించారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం తెలిసిందే. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించి.. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Published on: Nov 15, 2023 02:45 PM