Sajjala Ramakrishna Reddy: చేసేది దీక్ష.. మాట్లాడేదీ బూతులు.. చంద్రబాబుపై సజ్జల ఫైర్..
Sajjala on TDP Chief Chandrababu Naidu: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష ఓ ప్రహసనం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala on TDP Chief Chandrababu Naidu: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష ఓ ప్రహసనం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు దీక్ష దేనికో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడకి తెలియదని సజ్జల ఎద్దెవా చేశారు. 36 గంటల దీక్ష ఎందుకో టీడీపీ నేతలకే తెలియదంటూ సజ్జల విమర్శించారు. దీక్ష పేరుతో డ్రామాలు ఆడారంటూ సజ్జల విమర్శించారు. దీంతో చంద్రబాబు ఏం సందేశం ఇచ్చారంటూ ప్రశ్నించారు. దీక్షలో ఎలా పడుతూ అలా మాట్లాడుతున్నారని.. చూసుకుందాం, కొడతాం అంటూ బూతులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. చేసేది దీక్ష.. మాట్లాడేది బూతులు అంటూ సజ్జల చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బూతులను సమర్థిస్తూ తిడతారా..? అంటూ సజ్జల ప్రశ్నించారు. పట్టాభితో చంద్రబాబు తిట్టించారంటూ పేర్కొన్నారు. అరలీటర్ నీటితో 36 గంటలు కూర్చోవడం సాధ్యమేనా అంటూ సజ్జల పేర్కొన్నారు. 72 గంటలు ఆహారం తీసుకోని వ్యక్తి గంటకు పైగా మాట్లాడగలరా అంటూ ప్రశ్నించారు. గాంధేయవాదం పేరుతో చంద్రబాబు బూతులు మాట్లాడారని పేర్కొ్నారు.
పట్టాభి బూతులు ఏం మాట్లాడో తెలియదని చంద్రబాబు పేర్కొన్నారని.. పట్టాభితో ఆ మాట అనిపించిందే చంద్రబాబు అని సజ్జల పేర్కొన్నారు. ఇలానే ఉంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి ఇలానే మాట్లాడుతారా అంటూ సజ్జల చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు ఢిల్లీలో ఇదే పదంతో పలకరించగలరా అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలోనే గంజాయి దందా జరిగిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సజ్జల పేర్కొన్నారు. అక్రమ మద్యాన్ని నివారించేందుకు ఎస్ఈబీని నియమించామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో హింసకు పురిగోల్పుతుందే చంద్రబాబు అని సజ్జల పేర్కొన్నారు. అంతా చేసి అన్యాయం జరిగిందనడం సిగ్గుచేటని సజ్జల విమర్శించారు. రాష్ట్రంలో విద్వేషం సృష్టించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తొందరగా అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారని.. ఇదంతా నాటకమని పేర్కొన్నారు.
Also Read: