Chandrababu Naidu: పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Chandrababu Naidu Comments: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై, పోలీసులపై మరోసారి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉన్న లోకేష్‌పై సెక్షన్ 307 కేసు

Chandrababu Naidu: పోలీసులే దగ్గరుండి దాడి చేయించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
Chandrababu Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2021 | 7:47 PM

Chandrababu Naidu Comments: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై, పోలీసులపై మరోసారి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉన్న లోకేష్‌పై సెక్షన్ 307 కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు తమ ఖాకీ డ్రెస్‌ను ఇస్తే తామే.. ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు దగ్గరుండి టీడీపీ ఆఫీస్‌పై దాడి చేయించారని పేర్కొన్నారు. ఎవరెంత రెచ్చగొట్టినా తాను సంయమనం పాటించానంటూ పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం 40 సంవత్సరాలని ప్రత్యర్థులు ఎంత రొచ్చగొట్టినా దిగజారి ప్రవర్తించలేదంటూ పేర్కొన్నారు. దాటి అనంతరం పోలీసులు దగ్గరుండి.. దాడి చేసిన వారిని పంపించారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 36 గంటల దీక్ష ముగిసిన సందర్భంగా  టీడీపీ ఆఫీస్‌లో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

దాడులను నియంత్రించడంలో డీజీపీ విఫలమయ్యారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆయన తలుచుకుంటే దాడులు జరిగేవా అని పేర్కొన్నారు. పట్టాభి తిట్లకు కొత్త అర్ధం చెప్పారంటూ తెలిపారు. డ్రగ్స్‌పై ఏపీ సీఎంకు సమీక్ష చేసే తీరిక లేదా అంటూ ప్రశ్నించారు. తప్పులపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ఎంటంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీపై దాడి వ్యవహారంలో ఇప్పటివరకు ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఏ తప్పు చేయని వారందరినీ అరెస్టు చేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయం అంటూ ధ్వజమెత్తారు.

వైసీపీది ఉగ్రవాద దాడి అని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తే ఊరుకునేది లేదంటూ పేర్కొన్నారు. పోలీసులు తప్పులు చేస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు సూచించారు. రేపు అనేది కూడా ఉంటుందని.. పోలీసులకు గుర్తుచేశారు. తనపైన కూడా తప్పులు కేసులు పెడతారా..? అంటూ చంద్రబాబు డీజీపీని ప్రశ్నించారు. టీడీపీ ఆఫీసుకు వంద గజాల దూరంలోనే డీజీపీ ఆఫీసు ఉందని కానీ దాడి జరిగిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. యువత, ప్రజల కోసం తాను ఆలోచించానని.. దానికోసం పోరాడుతానని తెలిపారు.

Also Read:

Crime news: ఏపీ గుంటూరులో మరో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కర్రలతో కొట్టి..

Crime News: వీళ్లు మామూలోళ్లు కాదు..  స్కెచ్ వేశారు.. ఏటీఎం కాలిపోయిందంటూ రూ.అరకోటి కొట్టేశారు.. చివరకు..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..