AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP MLA: ఈ కారణంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయ తేరంగేట్రం చేశారు. తొలి ప్రయత్నంలోనే శాశనసభ్యునిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 2014లో టీడీపీ తరఫున బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తరువాత 2017లో టీడీపీకి రాజీనామ చేసి జగన్ పార్టీలో చేరిపోయారు.

YCP MLA: ఈ కారణంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..
Mla Anna Venkata Rambabu
Srikar T
|

Updated on: Dec 27, 2023 | 7:51 PM

Share

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయ తేరంగేట్రం చేశారు. తొలి ప్రయత్నంలోనే శాశనసభ్యునిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. 2014లో టీడీపీ తరఫున బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తరువాత 2017లో టీడీపీకి రాజీనామ చేసి జగన్ పార్టీలో చేరిపోయారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తిరిగి విజయం సాధించారు. మొన్నటి రెండవ దఫా మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఆయనకు దక్కలేదు. అయినప్పటికీ ప్రజాక్షేత్రంలో ఉంటూ వైసీపీతో కలిసి పనిచేస్తున్నారు. అయితే తాజాగా అన్నా వెంకట రాంబాబు తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేనని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి వైదొలిగేందుకు అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘వైకాపాలో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుంది. ఆ సామాజిక వర్గం నన్ను చాలా ఇబ్బందులు పెడుతోంది. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏం చేసింది? వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని జిల్లా ప్రజలు ఆదరించవద్దు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా పర్యటిస్తా’’ అని రాంబాబు తెలిపారు.

తనకు పార్టీలో ఒక వర్గం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వైసీపీలోనే ఉంటా.. ఇతర పార్టీలు మారను అని స్పష్టం చేశారు. వైసీపీ అధిష్టానం గిద్దలూరులో ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా అతని గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఇంతకాలం నన్ను, నా సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడిన ఇతర నాయకులు ఇప్పటికైనా కలిసికట్టుగా పనిచేసి గిద్దలూరులో వైసీపీ అభ్యర్థిని గెలిపించండని కోరారు. దీంతో జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గిద్దలూరు ఎమ్మెల్యే చర్చలోకి వచ్చారు. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..