పొలిటికల్ టర్న్ తీసుకున్న లోకేష్ జూమ్ మీటింగ్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ నేతల ఎంట్రీ..
జూమ్ మీటింగ్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవేందర్‌రెడ్డి లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే వీడియోలు..
టెన్త్ విద్యార్థులతో నారా లోకేష్(Nara Lokesh) జూమ్ మీటింగ్(Zoom Meeting) పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు ఎంట్రీ ఇవ్వడం కలకలం రేపింది. ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi), వైసీపీ నేత దేవేందర్‌రెడ్డి లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే వీడియోలు కట్ చేయడం, వైసీపీ నేతలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జూమ్ మీటింగ్‌కు రాజకీయ రంగు అంటుకుంది. జూమ్ మీటింగ్ మొదలైన పావు గంట తర్వాత ఓ విద్యార్థికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే వీడియోలోకి సడన్‌గా వల్లభనేని వంశీ వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే ఆడియో కట్ అయింది. వంశీ ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. అది జూమ్ మీటింగ్‌లో వినిపించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే వీడియో కూడా కట్ అయింది.
ఆ తర్వాత కొద్దిసేపటికి వైసీపీ నేత దేవేందర్‌రెడ్డి కూడా లోకేష్ జూమ్ మీటింగ్‌లోకి వచ్చారు. మీరు చేసేది కరెక్టేనా, విద్యార్థులతో రాజకీయం చేస్తారా అంటూ లోకేష్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆడియో, వీడియో కట్ అయింది. ఆ వెంటనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. విద్యార్థులతో పవిత్ర కార్యక్రమం నిర్వహిస్తుంటే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారా, రాజకీయా చేస్తారా అంటూ మండిపడ్డారు. దమ్ముంటే నేరుగా వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు లోకేష్.
జూమ్ మీటింగ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ వచ్చిన స్క్రీన్ షాట్స్‌ను చూపించారు లోకేష్. రాజకీయం చేయడానికే వైసీపీ నేతలు మీటింగ్‌లోకి వచ్చారని మండిపడ్డారు.
ఓ విద్యార్థిని పిన్ని కూడా రాజకీయం చేయడం కరెక్టేనా అంటూ లోకేష్‌ను ప్రశ్నించింది. దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు లోకేష్.