AP News: పోలీసులకే జలక్ ఇచ్చిన మహిళ.. ఏకంగా స్టేషన్‌కే తాళం పెట్టేసిందిగా.. అసలేం జరిగిందంటే..
పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫిర్యాదు చేసి గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్‌కు వస్తున్న ఓ మహిళ అనూహ్యంగా పోలీసులకు షాక్ కు గురి చేసేలా వ్యవహరించింది. తన గోడు విని న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ గేటుకు తాళాలు వేసింది. దీంతో దెబ్బకు కంగుతిన్న పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తాళాలు తీయించారు.

అనకాపల్లి జిల్లా, అక్టోబర్ 18: పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫిర్యాదు చేసి గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్‌కు వస్తున్న ఓ మహిళ అనూహ్యంగా పోలీసులకు షాక్ కు గురి చేసేలా వ్యవహరించింది. తన గోడు విని న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ.. పోలీస్ స్టేషన్ గేటుకు తాళాలు వేసింది. దీంతో దెబ్బకు కంగుతిన్న పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తాళాలు తీయించారు.
అసలు విషయం ఇదే…
పెందుర్తి శ్రీకృష్ణరాయపురంలో ఓ అపార్ట్మెంట్‌లో అద్దెకు నివాసం ఉంటోంది గౌతమి. భర్త దూరం అవడంతో తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఇంటిని అమ్మేందుకు ఓనర్ సిద్ధమై ఖాళీ చేయాలని చెప్పడంతో ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది గౌతమి. ఐదు లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చానని చెబుతోంది. అయినప్పటికీ.. గౌతమికి ఇంటి ఓనర్ నుంచి వేధింపులు మొదలయ్యాయి. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తాను అడ్వాన్స్‌గా ఇచ్చిన ఐదు లక్షల తిరిగి చెల్లిస్తే.. ఖాళీ చేస్తానని గౌతమి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ఓ రోజు గౌతమి ఇంట్లో లేని సమయంలో సదరు ఓనర్.. ఆమె సామాన్లు బయటపెట్టి.. ఇంటికి తాళాలు వేసేశారు. ఆడపిల్లలు ఆరుబయటే ఉండిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన గౌతమి కూడా ఓనర్‌ను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. గత నెల 25న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక మళ్లీ సదరు ఓనర్ ఈ నెల 13న మరోసారి వచ్చి ఆమె సామాన్లు బయట వేసేశారు. తాను అడ్వాన్స్‌గా చెల్లించిన మొత్తాన్ని ఇవ్వాలని చెప్పడంతో.. యజమాని నిరాకరించినట్టు తెలుస్తోంది. గౌతమి ఖాళీ చేయకపోవడంతో ఆమె సామాన్లను బయట పడేశారు యజమాని. దీనిపై పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. పోలీసుల కేసు కూడా నమోదు చేశారు.
వరండాలోనే ఆడపిల్లలతో కలిసి నివాసం..
ఇంటికి తాళం వేసినప్పటికీ వరండాలోనే గౌతమి తన పిల్లలతో కలిసి నివాసముంటుంది. మరోవైపు తన బిడ్డతో కలిసి రోడ్డు మీద పడ్డాడని.. తనకు ఎలాగైన న్యాయం చేయాలని పోలీసుల ఆశ్రయించింది. తనకు తాళాలు తీయించి ఇంటిని అప్పగించేలా న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. ఆ విషయం తమ పరిధి కాదంటూ.. పోలీసులు తన గోడు వినిపించుకోకుండా.. సరిగ్గా స్పందించకపోవడంతో.. విసిగి వేసారిన గౌతమి.. పోలీస్ స్టేషన్ ప్రహరి ప్రధాన గేటుకు తాళాలు వేసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి తాళాలు తీయించారు.
ఇంటికి వెళ్లి తాళాలు తీయాలని యాజమానికి పోలీసుల సూచన.. సీఐకు స్వల్ప అస్వస్థత..
ఆ తర్వాత హుటాహుటిన గౌతమిని తీసుకుని ఇంటికి వెళ్లారు పోలీసులు. యజమానితో మాట్లాడి తాళాలు తీయించి సామాన్లు లోపల పెట్టించి ఇంటిని అప్పగించాలని ఆదేశించారు. అయితే సదరు ఇంటి యజమాని.. తనకు తప్పుడు పత్రాలు చూపించి.. గౌతమి వేధిస్తోందని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ తరుణంలో స్థానిక సీఐ శ్రీనివాసరావు ఉన్నట్టుండి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొద్దిసేపటికి ఆయన ఆరోగ్యం కుదుటపడింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
