AP News: దసరా సెలవుల్లో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..
దసరా సెలవు తేదీలో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి ఈ నెల 23వ తేదీన దసరా పండుగ సెలవుగా ప్రకటించిన జగన్ సర్కార్.. ఇప్పుడు ఆ సెలవును కాస్తా అక్టోబర్ 23, 24న దసరా సెలవులుగా మారుస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, అక్టోబర్ 18: ఏపీ ప్రజలకు అలెర్ట్. దసరా సెలవుల్లో మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. తొలుత అక్టోబర్ 23వ తేదీన విజయదశమి పండుగకు అధికారిక సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా అక్టోబర్ 23, 24న రెండు రోజులు దసరా సెలవులుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల మార్పుతో ఆంధ్రప్రదేశ్‌లోని స్కూల్స్ అన్నింటికీ మొత్తం 10 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 24 విజయదశమి అనంతరం అక్టోబర్ 25న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అటు రాష్ట్రంలోని కాలేజీలకు కూడా దసరా సెలవులు వారం రోజులు ఉండే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఏపీలోని స్కూల్స్, కాలేజీలకు 2024, జనవరి 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉండనుండగా.. ఈ డిసెంబర్‌లో 17 నుంచి 26 వరకు క్రిస్మస్ సెలవులు ఉంటాయి. అలాగే దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు డేట్ బట్టి సెలవులు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 14 నుంచి 24 వరకూ ప్రకటించిన దసరా సెలవుల్లో ఎలాంటి క్లాసులు నిర్వహించకూడదని విద్యాశాఖ తెలిపింది. సెలవుల్లో ప్రభుత్వ స్కూళ్లు మూతపడినా, పలు చోట్ల ప్రైవేటు స్కూళ్లు మాత్రం పని చేస్తూనే ఉంటున్నాయని.. అలాంటి స్కూల్స్ ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా పండుగ సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేసింది. .
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..